Saturday, October 5, 2024
HomeతెలంగాణManchiryala: పకడ్బందీగా నామినేషన్లు

Manchiryala: పకడ్బందీగా నామినేషన్లు

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలకు గురికావాల్సిందే

శాసనసభ నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్ అన్నారు. జిల్లాలోని 004-మంచిర్యాల రిటర్నింగ్ అధికారి, మంచిర్యాల రాజస్వ మండల అధికారి కార్యాలయాన్ని మంచిర్యాల డిసిపి, సుధీర్ రాంనాథ్ కేకన్, ఎసిపి, తిరుపతిరెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ.. శాసనసభ నియోజకవర్గ ఎన్నికలలో భాగంగా ఈ నెల 3న నోటిఫికేషన్ విడుదల జరిగి ఈ నెల 10వ తేదీ వరకు రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను స్వీకరిస్తామని, ఈ క్రమంలో దాఖలైన నామినేషన్లను ఈ నెల 13న పరిశీలిస్తామన్నారు.

- Advertisement -


నామినేషన్లను భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు స్వీకరించామని, విధుల్లో నియమితులైన అధికారులు తమ డ్యూటీని సరక్రమంగా నిర్వర్తించాలని, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలన్నారు. ఉల్లంఘించిస్తే ఎన్నికల నియమ, నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ నెల 15న అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ, 30వ తేదీన పోలింగ్, డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ జరుగుతాయని, ఎన్నికల నిబంధనలు డిసెంబర్ 5వ తేదీ వరకు అమలులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News