Saturday, October 5, 2024
Homeహెల్త్Nailpolish is must: నెయిల్ పాలిష్ తప్పనిసరా? ఎందుకలా?

Nailpolish is must: నెయిల్ పాలిష్ తప్పనిసరా? ఎందుకలా?

చలికాలం వస్తే చాలు చర్మం, జుట్టు సంరక్షణలో మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటాం. కానీ చేతులు, పాదాల గోళ్ల విషయంలో మాత్రం అశ్రద్ధ వహిస్తుంటాం. అందుకే ఈ సీజన్ లో గోళ్లు అందంగా, ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని టిప్స్ మీకోసం:

- Advertisement -

 చలికాలంలో గోళ్లకు పాలిష్ తప్పనిసరిగా వేసుకోవాలి. పాలిష్ నీళ్ల నుంచి గోళ్లను సంరక్షిస్తుంది. గోళ్లు పటిష్టంగా ఉండి విరగకుండా కాపాడుతుంది.

 గోళ్లకు కూడా మాయిశ్చరైజర్ అవసరం. టేబుల్ స్పూన్ బాదం, ఆముదం నూనె మిశ్రమంలో కొద్దిగా హ్యాండ్ క్రీము వేసి అందులో 20 నిమిషాల పాటు గోళ్లను ఉంచాలి. ఆ తర్వాత దాన్ని చేతులకు బాగా పట్టించి మసాజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే గోళ్లు, చేతులు మెరుపును సంతరించుకుంటాయి.

 చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గే కొద్దీ గోళ్లల్లో తేమ తగ్గిపోతుంది. తేమ కొరవడడం వల్ల గోళ్లు విరిగిపోతుంటాయి. పొడారినట్టు అవుతాయి. అందుకే ఎప్పుడూ తేమ ఉండేలా గోళ్లకు, చేతులకు , వేళ్లకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. మంచి హ్యాండ్ క్రీము తీసుకుని దాన్ని ప్రతి గోరు మీద, వేళ్ల మీద బాగా పట్టేలా మసాజ్ చేసుకోవాలి.

 బయట షాపుల్లో దొరికే హ్యుమిడిఫైయర్స్ కూడా గోళ్లు, చేతులపై బాగా పనిచేస్తాయి.

 గోళ్లదగ్గర ఉండే చిగుళ్లు గోళ్లను సంరక్షిస్తాయి. అందుకే గోళ్ల చిగుళ్లకు కూడా క్రీము లేదా నూనె రాసి మసాజ్ చేస్తే వాటికి కావలసినంత మాయిశ్చరైజర్ అందుతుంది. ఇలా చేయడం వల్ల గోళ్లు విరగకుండా, చిట్లకుండా ఆరోగ్యంగా ఉంటాయి.

 చలికాలంలో గోళ్లు దెబ్బతినకుండా ఉండాలంటే చేతులకు గ్లోవ్స్ వేసుకోవడం మంచిది. ఇలా చేస్తే గోళ్లు పొడారినట్టు అవవు. గోళ్లల్లో మలినాలు చేరవు. చలి వల్ల గోళ్లు చిట్లకుండా గ్లోవ్స్ కాపాడతాయి కూడా.

 పాలిష్ వేసుకునేటప్పుడు గోళ్లపై బేస్ కోట్ నుంచి టాప్ కోట్ వరకూ వేసుకోవాలి.

 డైట్ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. సమతులాహారం తీసుకుంటే గోళ్లు ద్రుఢంగా ఉంటాయి. వాల్ నట్స్, శెనగలు, ఆకుకూరలు, అవకెడో వంటివి తింటే గోళ్లు బలంగా ఉంటాయి.

 పదిహేను రోజులకు ఒకసారి తప్పనిసరిగా మెనిక్యూర్ చేయించుకోవాలి. మెనిక్యూర్ చేయించుకోబోయే ముందు గోరువెచ్చటి ఆలివ్ ఆయిల్ లో ఐదు నిమిషాలు గోళ్లను నాననివ్వాలని మరవొద్దు.

 చలికాలంలో గోళ్లు పగులుతుంటాయి. చిట్లుతుంటాయి. అందుకే రెండు టేబుల్ స్పూన్ల గెలటైన్ ని ఒక గ్లాసుడు నీళ్లల్లో కలుపుకుని రోజూ తాగాలి. ఇలా చేస్తే గోళ్లు గట్టిగా ఉంటాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News