Saturday, October 5, 2024
HomeతెలంగాణMadhavaram Krishnarao: అల్లాపూర్ డివిజన్ లో బిఆర్ఎస్ లోకి చేరికలు

Madhavaram Krishnarao: అల్లాపూర్ డివిజన్ లో బిఆర్ఎస్ లోకి చేరికలు

కాలనీల అసోసియేషన్స్ తో ఆత్మీయ సమ్మేళనం

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత నగర్, జనప్రియ నగర్కు చెందిన పలువురు బీజేపీ నుండి బిఆర్ఎస్ లోకి ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు సమక్షంలో చేరారు. కార్పొరేటర్ సబ్య గౌసిద్దీన్ ..మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ గౌసుద్దీన్ ఆధ్వర్యంలో భారీ చేరికలు జరిగాయి. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావుని భారీ మెజారిటీతో గెలిపించి హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీరరెడ్డి, జాహెద్ షరీఫ్ బాబా, రాజు రజక, గంగపుత్ర శంకర్, శ్రీనివాస్ యాదవ్, నితిన్, బ్రహ్మం, రాము యాదవ్, లాల్ సింగ్, ఆకుల లక్ష్మణ్, ఆకుల దుర్గ ప్రసాద్, చంద్ర, సూరి, బాషా, రాందాస్, వెంకట్, అశోక్, నరేష్, నటరాజ్, స్వామి, సురేష్, అనిల్, వెంకట్ రెడ్డి, హనుమంత్, మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, వెంకటమ్మ, రేవతి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి కూకట్పల్లి డివిజన్లోని మైత్రి నగర్, ఏబీవీ పురం దయార్ గూడ మొదలగు ప్రాంతాల్లో కాలనీల అసోసియేషన్ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో కూకట్పల్లి నియోజకవర్గాన్ని దాదాపు 9 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకున్నం అని.. అంతేకాకుండా తన సొంత ఊరైన కూకట్పల్లిని ఈనాడు చరిత్రత్మకమైన దేవాలయాలు మసీదులు, చర్చిలు వంటివి కులమతాలకతీతంగా వాటి ప్రాసస్త్యాన్ని కాపాడుతూ మంచినీటి కొరత లేకుండా రోడ్లు, డ్రైనేజీలు వంటి మౌలిక సదుపాయాలకు లోటు లేకుండా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నామన్నారు.

సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఇంటికి వెళుతున్నాయని ఇందులో భాగంగానే కళ్యాణ లక్ష్మి ..షాది ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ వంటి పథకాలతో ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని అన్నారు… ఎన్నో ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్ బిజెపి పార్టీలు ప్రజలకు చేసింది ఏమీ లేదని కేవలం కులాలు మతాలు అడ్డుపెట్టుకుని నేడు స్థానికంగా ఉండే నాయకులకు కాకుండా ఎక్కడెక్కడ నుంచో పారాషూట్ నాయకులు దింపి పోటీకి పెడుతున్నాయని ప్రజలు దీని అంతటినీ గమనించి అభివృద్ధికే మళ్లీ పట్టం కట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తేనే తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళుతుందని అది మన కళ్ళ ముందు కనబడుతుందని చెప్పారు పదేళ్ల కాలంలో శాంతిభద్రతలు విషయంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందని అన్నారు. దీన్ని కాపాడుకోవాలంటే ఈ కారు గుర్తుకు ఓటు వేసి ముందుకు వెళ్లాలని కోరారు…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News