Sunday, June 15, 2025
HomeతెలంగాణLingala Kamal Raj: నా గెలుపు మధిర ప్రజల కోసం

Lingala Kamal Raj: నా గెలుపు మధిర ప్రజల కోసం

ఒక్క ఛాన్స్ ప్లీజ్..

కారు గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించి ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను బీఆర్ఎస్ పార్టీ మధిర అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్ రాజు గారు అభ్యర్థించారు. ఎర్రుపాలెం మండలంలోని సఖినవీడు, ములుగుమాడు, ఇనగాలి, రామన్నపాలెం గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కెసిఆర్ గారి సహకారంతోనే మధిర నియోజకవర్గ వ్యాప్తంగా కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్నాం అన్నారు. రాష్ట్రంలో మళ్లీ అధికారం బీఆర్ఎస్ పార్టీదే అని మధిరలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉండాలన్నారు. వ్యాపారాలు రాజకీయాల పేరుతో హైదరాబాదు, ఢిల్లీలో ఉండే పని నాకు లేదన్నారు. మీ మధ్యన ఉంటూ మధిర నియోజకవర్గ అభివృద్దే నా ధ్యేయం అన్నారు. బట్టి విక్రమార్క గారి గెలుపు కేవలం తన రాజకీయ లబ్ధి కోసమని నా గెలుపు మధిర ప్రజల కోసం అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News