Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజకీయాల గురించి మాట్లాడారు. హైదరాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్ లో ఎర్రమిల్లి నారాయణమూర్తి కళాశాల పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమావేశం జరగగా ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు. చిరంజీవి కూడా అదే కాలేజీలో చదవడంతో గెస్ట్ గా వెళ్లారు.
ఈ గెట్ టు గెదర్ లో తన కళాశాల స్నేహితులతో కలిసి నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు చిరంజీవి. ఎక్కడెక్కడో స్థిరపడిన వాళ్లంతా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ మరోసారి రాజకీయాల గురించి, తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు.
చిరంజీవి మాట్లాడుతూ.. ”నేను ఏదన్నా ఒకటి తలిస్తే దాని అంతు చూడాలి అనుకుంటాను. కానీ అది మనసులోంచి రావాలి. రాజకీయాల్లో రాణించడం చాలా కష్టం. అక్కడ సెన్సిటివ్ గా ఉంటే కష్టం. నేను అక్కడ ఇమడలేక బయటకి వచ్చేశాను. రాజకీయాల్లో మాటలు అనాలి, అనిపించుకోవాలి. నా తమ్ముడు పవన్ అయితే అంటాడు, అనిపించుకుంటాడు. పవన్ రాజకీయాలకి సరిపోతాడు. ఏదో ఒక రోజు పవన్ ని అత్యున్నత స్థానంలో చూస్తాను” అని అన్నాడు.
దీంతో మెగాస్టార్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. గతంలో కూడా పలుమార్లు చిరంజీవి పవన్ కి సపోర్ట్ గా మాట్లాడారు. ఇప్పుడు కూడా మాట్లాడటంతో ఇండైరెక్ట్ గా చిరంజీవి పవన్ కి పూర్తి మద్దతు ఇస్తున్నట్టే తెలుస్తుంది. చిరంజీవి మాటలు జనసేన వర్గాల్లో మరింత జోష్ ని నింపాయి.