Friday, November 22, 2024
Homeపాలిటిక్స్Tandur: తాండూరు బీఆర్ఎస్ ఖాళీ!

Tandur: తాండూరు బీఆర్ఎస్ ఖాళీ!

పట్నం 'వ్యూహం'? ఉచ్చులో పైలట్

నేడు ఒక పార్టీ…. రేపు ఇంకో పార్టీ.. ఎల్లుండి ఎక్కడికో…? బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం లోని బషీరాబాద్, పెద్దేముల్, యాలాల్, తాండూరు మండల మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అనుచరులు బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, తాండూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.

- Advertisement -

ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్, తాండూరు, యాలాల్ మండలాల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారు…. బషీరాబాద్ మండలం –  ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్,  జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, కోర్విచెడ్ సర్పంచ్ శోభారాణి, పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ శ్రీనివాస్.  తాండూరు మండలం – ఎంపీపీ సంగెం అనిత గౌడ్, డిసీసీబీ డైరెక్టర్ రవి గౌడ్, మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ గౌడ్, పిఎసిఎస్ డైరెక్టర్లు నర్సింహులు, రాఘవేందర్, హన్మంత్ రెడ్డి, నారాయణ, బిచ్చయ్య. యాలాల్ మండలం – పిఎసిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు వెంకటయ్య, పట్టణ కౌన్సిలర్లు భీమ్ సింగ్ రాథోడ్ ప్రవీణ్ గౌడ్, మాజీ కౌన్సిలర్ సోఫియా, అప్షాబేగం తదితరులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.. ఇదిలా ఉండగా పలువురు నేతల నోట మాత్రం… మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అనుచరులు మాత్రమే పార్టీ మారుతున్నారని చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు.

పట్నం వర్సెస్ పైలెట్ వర్గ పోరు అందరికీ తెలిసిందే. ఇటీవల అధిష్టానం వీరిద్దరి వర్గ పొరుకి బ్రేక్ లు వేసి తాండూరు అసెంబ్లీ నుంచి పైలెట్ రోహిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని పట్నం మహేందర్ రెడ్డికి అధిష్టానం తెలిపింది. ఆయినా వీరి మధ్య వర్గ పోరు ఏమాత్రం చల్లారకపోగా తారాస్థాయికి చేరినట్టు తెలుస్తుంది. పైలట్-పట్నం మధ్య విభేదాలు సమిసిపోకవటం, ఆధిపత్య పోరు వల్లే ఇక్కడి రాజకీయాలు రాత్రికి రాత్రి మారుతున్నాయన్న మాట తాండూరు వ్యాప్తంగా పలువురు నేతల నోట వినిపిస్తోందన్నమాట. పట్నం బిఆర్ఎస్ లోనే ఉండి వారి అనుచరులను కాంగ్రెస్ గూటికి పంపుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే తాండూరు బిఆర్ఎస్ పార్టీ దాదాపు ఖాళీ అయిపోనట్టే అన్నది స్థానికుల చర్చల సారాంశం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News