Saturday, October 5, 2024
HomeతెలంగాణVanaparthi: నిరంజన్ రెడ్డి మళ్లీ గెలవాలని 23 కిలోమీటర్లు రన్నింగ్

Vanaparthi: నిరంజన్ రెడ్డి మళ్లీ గెలవాలని 23 కిలోమీటర్లు రన్నింగ్

పెబ్బేరు నుండి వనపర్తి వరకు రన్నింగ్ చేసిన ప్రైవేటు ఉద్యోగి ప్రకాష్

రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రెండవసారి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించాలని పెబ్బేరు చెందిన ప్రకాష్ అనే ప్రైవేట్ ఉద్యోగి 23 కిలోమీటర్లు రన్నింగ్ చేశారు. వనపర్తి సమీపంలోని రాజనగరం దేవాలయంలో పూజలు, చండీ హోమం చేస్తున్న మంత్రి నిరంజన్ రెడ్డి వరకు వచ్చిన ప్రకాష్ తన ఆకాంక్షను మంత్రికి వివరించారు. తన గెలుపు కోసం 23 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తూ వచ్చిన ప్రకాష్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , ఆయన సతీమణి సింగిరెడ్డి వాసంతి, నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్త వంగూర్ ప్రమోద్ రెడ్డి అభినందించి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, కౌన్సిలర్ బాష్యా నాయక్, మీడియా సెల్ ఇంచార్జి నందిమల్ల అశోక్ ,పెబ్బేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గౌని బుచ్చరెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

మంత్రి సమావేశంలో బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేతలు…

పెబ్బేరు మండల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొండారెడ్డి తో పాటు 10 మంది కాంగ్రెస్ నాయకులు, ఖిల్లా ఘనపురం మండలం ముందరి తండాకు చెందిన రాజు నాయక్ ఆధ్వర్యంలో 20 మంది కాంగ్రెస్ నాయకులు , పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామం కాంగ్రెస్ మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు హరికుమార్ రెడ్డి శనివారం జిల్లా కేంద్రం లోని మంత్రి నివాస గృహంలో వేరువేరుగా బీ ఆర్ ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, బీఆర్ ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముందుగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News