Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Rahul T Shirt: సత్యమే రాహుల్ గాంధీకి రక్షణ కవచం, రాహుల్ ను దేవుడు కాపాడతాడు:...

Rahul T Shirt: సత్యమే రాహుల్ గాంధీకి రక్షణ కవచం, రాహుల్ ను దేవుడు కాపాడతాడు: ప్రియాంక

రాహుల్ గాంధీ భద్రత నీకు పట్టదా? కశ్మీర్, పంజాబ్ కు రాహుల్ వెళ్తున్నాడే? మీ సోదరుడికి చలి పెట్టదా ? జస్ట్ టీ షర్ట్ లో తిరిగేస్తున్నాడే? కనీసం ఆయనకు ఓ జాకెట్ వేసుకోమని చెప్పచ్చుగా? ఇలాంటి ప్రశ్నలు తనకు నిత్యం ఎదురవుతున్నాయన్న ప్రియాంక గాంధీ వాద్రా వీటికి ఓపికగా తన స్టైల్ లో సమాధానాలు చెప్పారు. సత్యమే రాహుల్ గాంధీకి రక్షణ కవచం, రాహుల్ ను దేవుడు కాపాడతాడు అంటూ ప్రియాంక చెప్పడం విశేషం. ఇక వణికించే చలిలో సైతం రాహుల్ కేవలం టీ షర్ట్ లో కలియ తిరుగుతుండటం పెద్ద సెన్సేషన్ గా మారింది. రాహుల్ కు చలి పెట్టదా అంటూ రిపోర్టర్లు, సామాన్యులు ఒకటే చర్చలు చేస్తుంటే దీనిపై స్పందించిన రాహుల్ తనకు చలి పెడితే స్వెట్టర్ వేసుకుంటానని, తనకు చలి అంటే భయం లేదని వివరించారు. రైతులు, కూలీలు, పేద చిన్నారులను ఈ ప్రశ్న వేయరెందుకని రాహుల్ మీడియాను ఎదురు ప్రశ్నించారు కూడా.

- Advertisement -

ఇక రాహుల్ జాకెట్లు కూడా వివాదాస్పదం అయ్యాయి. ఏడాది క్రితం ఫుల్ స్లీవ్స్ బ్లాక్ జాకెట్ వేసుకున్న రాహుల్ ను చూసి బీజేపీ.. అది బ్లూబెర్రీ బ్రాండ్, దాని ధర 60,000 రూపాయలని ప్రచారం చేసింది. ఆతరువాత భారత్ జోడో పాదయాత్రలోనూ రాహుల్ వేసుకున్న టీ షర్ట్ డిజైనర్ వేర్ అని, అది కూడా బ్లూ బెర్రీ బ్రాండ్, ధర 41,000 అంటూ విమర్శలకు దిగింది. దీంతో అప్పటి నుంచీ నాన్-బ్రాండ్ టీ షర్ట్ ను మాత్రమే రాహుల్ ధరిస్తూ వస్తున్నారు.

రాహుల్ జోడో యాత్ర రెండవ విడత ఢిల్లీలో ఈరోజు ప్రారంభమై, ఉత్తర్ ప్రదేశ్ లో ఎంటర్ అయింది. గురువారం నాటికి యాత్ర హర్యానా చేరుకోనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News