రేవంత్ రెడ్డి భారీ ఆరోపణలను బిఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈమేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు చెన్నూర్ బాల్క సుమన్, బెల్లంపల్లి దుర్గం చిన్నయ్య, మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి హద్దు మీరి మాట్లాడుతున్నాడని ఇలాంటి ఆరోపణలు చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తామని అన్నారు. దళిత బిడ్డలమైన బెల్లంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం చిన్నయ్య, చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిని అయినా తనను దళితులని చూడకుండా అనుచిత వాక్యాలు చేయడం, అవినీతి ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. తనపై చేసిన ఆరోపణలు వందల కోట్ల రూపాయలు ఉన్నాయని నిరూపించకపోతే జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బహిరంగ ముక్కు నేలకు రాస్తానని, లేకుంటే వివేక్ రాస్తాడా అని సవాల్ విసిరారు.
Balka Suman: వివేక్ కు బాల్క సుమన్ బహిరంగ సవాల్
దళితుడినని కూడా చూడకుండా ఆరోపణలా?