Thursday, September 19, 2024
Homeహెల్త్Coconut Oil: కొబ్బరినూనెతో మెరిసే చర్మం

Coconut Oil: కొబ్బరినూనెతో మెరిసే చర్మం

కొబ్బరినూనె తలకే కాదు చర్మానికి రాసుకుంటే కూడా ఎంతో మంచిదని మన బామ్మలు, అమ్మమ్మలు చెప్పడం అందరికీ తెలుసు. అంతేకాదు కొబ్బరినూనెతో బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే..
షాంపును తలకు పట్టించుకోవడానికి ముందు గోరువెచ్చని కొబ్బరినూనెను తలకు పట్టించుకుంటే మంచిది. దీనివల్ల వెంట్రుకలు బిరుసుగా, డ్రైగా ఉండవు. చిట్లిపోవు. అంతేకాదు కాలుష్యం, సూర్యరశ్మి కారణంగా జుట్టు పాడవకుండా కొబ్బరినూనె శిరోజాలను సంరక్షిస్తుంది. కొబ్బరినూనె చర్మానికి మాయిశ్చరైజర్‌గా, హైడ్రేటింగ్‌ ఏజెంటుగా పనిచేస్తుంది.
మేకప్‌ రిమూవర్‌గా కూడా కొబ్బరినూనె పనిచేస్తుంది. చర్మంపై ఉండే మేకప్‌ పదార్థాలను, చర్మంపై మురికి, ఆయిల్‌ రూపంలో ఉండే లేయర్‌ను కూడా కొబ్బరినూనె పోగొడుతుంది. మూడు నుంచి ఐదు టేబుల్‌ స్పూన్ల కొబ్బరి నూనెలో 20 చుక్కల రోజ్‌మేరీ ఆయిల్‌ వేసి బాగా కలిపి దాన్ని తలకు, వెంట్రుకలకు పట్టించి గంటపాటు షవర్‌ క్యాప్‌ తలకు పెట్టుకొని ఉండాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపుతో వెంట్రుకలను రుద్దుకుని నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు పట్టులా ఎంతో మృదువుగా కనిపిస్తుంది. చర్మం శుభ్రంగా ఉండడానికి వాడే స్క్రబ్‌లో కొబ్బరి నూనె కలిపి రాసుకుంటే చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News