Saturday, April 12, 2025
HomeతెలంగాణLB Nagar: బీఆర్ఎస్ లోకి వైసీపీటీపీ నేతలు

LB Nagar: బీఆర్ఎస్ లోకి వైసీపీటీపీ నేతలు

ఎల్బీ నగర్ అభివృద్ధి సుధీర్ తోనే సాధ్యం

వైఎస్ఆర్టిపీ ఎల్బి నగర్ నియోజకవర్గ సమన్వయకర్త మామిడి రామచందర్, వారి బృందం ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి సుధీర్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా మామిడి రామచందర్ మాట్లాడుతూ.. సుధీర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం చేస్తున్న కృషి, సంక్షేమ పథకాలు, వారి యొక్క ఆశయాలు నచ్చి పార్టీలో చేరామన్నారు. నియోజకవర్గం మీద బాగా పట్టు ఉన్న నాయకులు సుధీర్ రెడ్డి అని తెలిపారు. ఇంకా అభివృద్ధి చేయాలి అంటే సుధీర్ రెడ్డితో సాధ్యం అని తెలిపారు.

- Advertisement -

రాబోయే ఎన్నికల్లో సుధీర్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలుపించుకుంటామని హామీ ఇచ్చారు. దొంగ వీసాలు, డాక్యుమెంట్లు తయారు చేసి అమాయక ప్రజలను మోసం చేసేవ్యక్తి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని వారు వాపోయారు.

ఈ కార్యక్రమంలో రామవత్ రవి,భారత్ కుమార్, వెంకటేష్, యాదగిరి, శ్రీకాంత్ యాదవ్, నాగన్న, రాజు, చెన్నమ్మ, కోమల, కృష్ణ నాయక్, భిక్షపతి, రవీందర్ రెడ్డి, మేడి శ్రీనివాస్, అశోక్, వెంకటేష్, ప్రవీణ్, సాయి కుమార్, సునీల్, మల్లేష్, పరుశురాం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News