ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం ఖిల్లా ప్రాంతంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, పార్టీ లోక్ సభ లీడర్, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు నేతృత్వంలో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కోట్లాది నిధులు వెచ్చించి ఖమ్మం నగరాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన పువ్వాడ అజయ్ కుమార్ ను మంచి మెజార్టీతో గెలిపించాలని అలీ, ఎంపీ నామ ఓటర్లను కోరారు. ముఖ్యంగా ముస్లిం మైనారిటీలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి, ఆదుకున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ , పార్టీ జిల్లా అధ్యక్షులు తాతా మధు, మేయర్ నీరజ, మైనార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.