Saturday, April 12, 2025
HomeతెలంగాణChoppadandi: ఆశీర్వదించి అవకాశమిస్తే అభివృద్ధి చేస్తా

Choppadandi: ఆశీర్వదించి అవకాశమిస్తే అభివృద్ధి చేస్తా

నాకు ఛాన్స్ ఇవ్వండి..

చొప్పదండి రూరల్లో కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం జోరుగా ప్రచారం చేస్తున్నారు. తనను ఆశీర్వదించి అవకాశమిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానంటూ హామీలిస్తూ ఆకట్టుకుంటున్నారు. తెలంగాణలో అధికారంలోకి రానున్నది కాంగ్రెస్ పార్టీ అన్న మాటను పదేపదే చెబుతూ శ్రేణుల్లో ఉత్సాహం ఊదుతున్న సత్యం.. ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని చెప్పుకుపోతున్నారు.

- Advertisement -

గంగాధర మండలం వెంకటాయపల్లి , కాచిరెడ్డిపల్లి, కొండయ్య పల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న సత్యం.. 2004 ఆనాటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి 108 సేవలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, పెన్షన్, రుణమాఫీ, వంటి ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని కాంగ్రెస్ సర్కారు గత వైభవాన్ని ప్రజలకు గుర్తుచేస్తూ సాగుతున్నారు. సుంకే రవి చేసిన అభివృద్ధి శూన్యమని నిప్పులు చెరుగుతూ ఆయన ప్రసంగం ఆలోచింపచేసేలా ఉంది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, దుబ్బాసి బుచ్చయ్య, పుల్కం నరసయ్య, కర్ర విద్యాసాగర్ రెడ్డి, వీర్ల నర్సింగరావు, బండపల్లి యాదగిరి, బుర్గు గంగన్న, పుల్కం గంగన్న, శంకర్ ,యగ్నేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News