నియోజకవర్గం లో ఎన్నో అభివృద్ధి పనులు చేసి రూపురేఖలు మార్చిన మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి గత ఎన్నికలకు మించిన భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి సతీమణి సింగిరెడ్డి వాసంతి, కూతురు తేజస్విని తండా ప్రజలను విజ్ఞప్తి చేసారు. వనపర్తి మండలంలో కందిరీగా తండా, హామీయా తండా, ఎద్దుల గేరి, నాగమ్మ తండాలో స్థానిక సర్పంచులు, నాయకులతో కలిసి వారు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ సందర్బంగా నాగమ్మ తండాలో వారు మాట్లాడుతు రూ 32 లక్షలతో కాశీంనగర్ పంచాయతీ రోడ్ నుంచి నాగమ్మ తాండ వరకు బిటి రోడ్డు, రూ 5 లక్షలతో ఎస్టి కమ్యూనిటీ హాల్ నుండి పోచమ్మ దేవాలయం వరకు బిటి రోడ్డు, రూ 20 లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం, రూ 10 లక్షలతో సిసి డ్రైనేజీల నిర్మాణం రూ 41 9 సీసీ రోడ్లను, రూ 17 లక్షల 69 వెలతో మిషన్ భగీరథ పథకం ద్వారా 184 నల్ల కలెక్షన్లు ఇచ్చామని వారు గుర్తు చేశారు.
కారు గుర్తుకు ఓటు వేసి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శిక్షణ తరగతుల జిల్లా అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, మాజీ ఎంపిపి ప్రమీల, మండల అధ్యక్షులు మాణిక్యం, మండల యువజన సంఘం అధ్యక్షులు చిట్యాల రాము,సింగల్ విండో అధ్యక్షులు రఘు వర్ధన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి మాజీ సింగల్ విండో ప్రెసిడెంట్ రామకృష్ణ రెడ్డి నాయకులు శంకర్ నాయక్, తిరుపతయ్య, నాగమ్మ తండా మాజీ సర్పంచ్ గోపాల్, చందు, గౌడ్ నాయక్, పద్య నాయక్, శేఖర్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు, యువత పాల్గొన్నారు.