Saturday, October 5, 2024
HomeతెలంగాణVanaparthi: ఆదరించండి అభివృద్ధి చేస్తా

Vanaparthi: ఆదరించండి అభివృద్ధి చేస్తా

యువకుడిని, నేను కాపలదారుగా ఉంటా

భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి గెలిపించి ఆదరిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని వనపర్తి నియోజకవర్గం బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి అనుజ్ఞ రెడ్డి అన్నారు. పెబ్బేరు మున్సిపాలిటీ రూరల్ మండలాల పార్టీ కార్యాలయాన్ని బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి అనుజ్ఞ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పెబ్బేరు పట్టణ రూరల్ పట్టణ అధ్యక్షులు కంచి ఆంజనేయులు భగవంతు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ, ప్రచార కార్యక్రమంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి అనుజ్ఞ రెడ్డి పట్టణంలో 11 వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ, వ్యాపార సముదాయాలను సందర్శించి తమ అమూల్యమైన ఓటును కమలం పువ్వు గుర్తుపై వేసి బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో అలంపూర్ అసెంబ్లీలో ఉన్న పెబ్బేరు ప్రజలు బిజెపి పార్టీని మూడుసార్లు ఆదరించి రావుల రవీంద్రనాథ్ రెడ్డిని ఎమ్మెల్యేగా ఆశీర్వదించారని, పెబ్బేరు పట్టణం, రూరల్ బిజెపి పార్టీకి పటిష్టమైన కార్యకర్తల బలం ఉన్నదని సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ మరొకమారు బిజెపి అభ్యర్థిగా నిలబడ్డ నన్ను ఆదరించాలని బిజెపి అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిస్తే అధికార పార్టీ నాయకుల ఆక్రమణల నుండి ఆసియాలోనే ప్రసిద్ధి చెందిన సంత భూములను, వేణుగోపాల స్వామి దేవాలయ భూములను ఆక్రమణల నుండి రక్షించే బాధ్యత తన భుజస్కంధాలపై వేసుకుంటానని, దేవాలయ సంతభూములకు కాపలాదారుగా ఉంటానని పెబ్బేరు పట్టణ ప్రజలకు హామీ ఇచ్చారు.

కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీలు నాణేనికి బొమ్మ బొరుసు లాంటివని 2014 2018 ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే సంతల్లో పశువుల్లా బిఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయారని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా అది టిఆర్ఎస్ పార్టీకే వేసినట్లేనని, వాస్తవానికి మంత్రి నిరంజన్ రెడ్డి, పెద్దమందడి ఎంపీపీ మేగా రెడ్డి అధికార బి ఆర్ ఎస్ పార్టీలో నాలుగున్నరేళ్ళూ కాపురం చేసి ల్యాండ్ మాఫియా, ఇసుక, మట్టి మాఫియాలలో వచ్చిన డబ్బుల పంపకాలలో తేడాలు వచ్చి నేడు ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నారని ఆరోపించారు. ప్రజలందరూ ఈ వాస్తవాన్ని గ్రహించి ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో డబల్ ఇంజన్ సర్కారుకు అవకాశం ఇవ్వాలన్నారు.

యువకుడైన నాకు ఒకసారి అవకాశం ఇస్తే ప్రభుత్వ ఆస్తులకు కాపలాదారుగా ఉంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు హేమారెడ్డి, పట్టణ అధ్యక్షలు కంచ ఆంజనేయులు, అధ్యక్షులు భగవంత్ యాదవ్, వెంకటస్వామి క్రాంతి, రామకృష్ణ, రాఘవేందర్ గౌడ్, సర్వేశ్వర్ రెడ్డి, సర్వేశ్వర్, ఆర్టిస్ట్ వేణు, నాగరాజు, మొగిలి రఘు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News