Saturday, April 19, 2025
HomeతెలంగాణRaghunath Yadav: కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవండి

Raghunath Yadav: కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవండి

దూకుడు మీదున్న కాంగ్రెస్ అభ్యర్థి

ప్రజలకు అమలు చేయగలిగే పథకాలు, హామీలనే తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ వెల్లడించారు. హఫీజ్ పేట్ డివిజన్ ప్రేమ్ నగర్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రఘునాథ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఆయన ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా రఘునాథ్ యాదవ్ పత్రికల వారితో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన 6 గ్యారెంటీ పథకాలు సామాన్యులకు అందనున్నాయని తెలిపారు. ఒక్కో వర్గానికి సంబంధించి ఒక్కో ప్రధాన అంశాన్ని పార్టీ ఇచ్చే గ్యారెంటీలో చేర్చామన్నారు.

- Advertisement -

అన్ని వర్గాలను ఆకట్టుకునేలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రూపకల్పన చేసిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్త పార్టీకి అండగా నిలవాలని, రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని రఘునాథ్ పిలుపునిచ్చారు. శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కష్టపడాలని ఆయన ప్రతి కార్యకర్తకు సూచించారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ ఆదరించాలని ఆయన కోరారు.

ఒక్కసారి అవకాశం ఇస్తే శేరిలింగంపల్లి నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని రఘునాథ్ యాదవ్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శాంతయ్య, ఉమామహేశ్వరరావు, నరేందర్ గౌడ్, సందీప్ గౌడ్, మల్లేష్, జమీల్, సందీప్, వెంకటేష్, దేవేందర్, రషీద్, రహీం, కుమ్మరి శ్రీశైలం, గిరి కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News