Friday, November 22, 2024
Homeపాలిటిక్స్KCR @ Choppadandi: సంక్షేమ పతకాలే తెలంగాణకు శ్రీరామరక్ష

KCR @ Choppadandi: సంక్షేమ పతకాలే తెలంగాణకు శ్రీరామరక్ష

వాన్ని, వీన్ని చూసి ఆగం గావద్దు

ఎలక్షన్లు రాగానే వాడొగడు, వీడొగడు ఇదిజేద్దాం, అదిస్తమంటూ వస్తుంటరు వాళ్లను చూసి ఆగం గావద్దని, సంక్షేమ పథకాలే తెలంగాణకు శ్రీరామ రక్షని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కరీంనగర్ జిల్లా, చొప్పదండి నియోజకవర్గంంలోని గంగాధర మండలంలోని మధురానగర్ గ్రామంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా హాజరై కేసీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసమని, వోటు వేయాలంటే పార్టీల చరిత్ర చూడాలని, రాయేదో రత్నమేదో తెలుస్తదని అన్నారు. తెలంగాణ కోసం 58 సంవత్సరాలు బాడపడ్డం ఏడ్చినం, వలసలు పోయినం, ఒకప్పుడు చొప్పదండి నియోజకవర్గంలో తాగుదామంటే నీళ్ళు దొరకని పరిస్తితి, రామడుగు మండలంలో రాంచంద్రాపూర్ సర్పంచ్ తిరుపతి బోర్లు వేసి నీళ్ళు రాక ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీరు చూసిందేనన్నారు. ఈ నియోజకవర్గంలో కొలువైన కొండగట్టు అంజన్నకు వేయి కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తానన్నారు.

- Advertisement -

కాంగ్రెస్ హయాంలో కరెంట్ కు ఎంతో బాడపడ్డాం, తెలంగాణ వచ్చినంక 24 గంటల కరెంట్ ఇస్తే తెలివి లేని దద్దమ్మ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మూడు గంటల కరెంట్ చాలని 10 హెచ్పీ మోటర్లు పెట్టాలని అంటున్నాడు. 10 హెచ్పీ మోటార్లను తెలంగాణలో ముప్పై లక్షల పంపు సెట్లను ఎవరు కొనియ్యాలన్నారు. తెలివి లేని కాంగ్రెస్ పార్టీకేసుడా, 24 గంటల కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ పార్టీకి వోటేసుడా మీరే నిర్ణయించుకోవాలన్నారు. అరవై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ రెండు వందల రూపాయల పించన్ ఇస్తే అదే మనం వేయి రూపాయలు ఇచ్చినం. దాన్ని రెండు వేలు జేసినం, మళ్ళీ అధికారంలోకి వస్తే ఐదు వేల రూపాయలు ఇస్తాం. చొప్పదండి నియోజకవర్గం మరో కోనసీమగా మారడంతో ఒక లక్ష ఇరువై ఐదు వేల ఎకరాల భూమి సాగునీరు అందిందన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని గోపాలరావుపేట, గర్శకుర్తి గ్రామాలను ప్రభుత్వం ఏర్పడగానే వెంటనే రెండు గ్రామాలను మండలాలుగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇవన్నీ సక్రమంగా జరుగాలంటే కారు గుర్తుపై వోటేసి, సుంకె రవిశంకర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సింగిల్విండోలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News