Saturday, September 21, 2024
Homeపాలిటిక్స్KCR @ Jammikunta: కాంగ్రెస్ కు, బిజెపికి ఓటెందుకు వేయాలి

KCR @ Jammikunta: కాంగ్రెస్ కు, బిజెపికి ఓటెందుకు వేయాలి

తెలంగాణ హక్కులను కాపాడటం కోసం పుట్టింది

బిఅర్ఎస్ తెలంగాణ ప్రజల హక్కులను కాపాడటం కోసం పుట్టిందని, ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందో ప్రజలు ఆలోచించాలని సీఎం కేసీఆర్ అన్నారు. అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ కు, మన మీద పగ పట్టిన బిజెపికి ఓటు ఎందుకు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ 18 నిమిషాలు ప్రసంగించారు.

- Advertisement -

భారత దేశమంలో 75 ఏళ్ల స్వాతంత్య్రం పూర్తి అయ్యాక కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిణతి రాలేదన్నారు. ఎన్నికలు వచ్చాయి అంటే అబద్ధాలు, ఆరోపణలు జరుగుతాయని, ఏ దేశమంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిణతి వచ్చిందో ఆ దేశం అభివృద్ధి చెందింది అన్నారు. సభకు హాజరైన వారు ఇంటికి వెళ్ళాకా చర్చ చేయండి రాయి ఎది రత్నం ఎది అని అన్నారు. ఇక్కడ బిఅర్ఎస్ నుండి కౌశిక్ రెడ్డి పోటీలో ఉన్నారు.

కాంగ్రెస్ నుండి ఒకతను, బీజేపీ నుండి ఒకతను పోటీలో ఉన్నారు. పోటీలో నిలబడ్డ వ్యక్తి గుణ గనాల గురించి ఆలోచన చేయాలన్నారు. గుడ్డిగా ఏదో ఒక ఊపులో ఓటేయడం సరికాదన్నారు. మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి. బిఅర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల హక్కులను కాపాడటం కోసం పుట్టింది, కాంగ్రెస్ పార్టీ ఏంది, బీజేపీ పార్టీ ఎంది వారి వైఖరి ఏంటో చూడాలన్నారు. మీరంతా నాతో ఉద్యమం చేసిన వారేనని, 2004 మేము రాష్ట్రం ఇస్తామని కాంగ్రెస్ మనతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రం ఇవ్వక దోఖా చేసిందన్నారు.


అలాంటి సమయములో మీ అందరి సహకారముతో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే భయపడి తెలంగాణను ఇచ్చారు అది కాంగ్రెస్ చరిత్ర అని అన్నారు. బీజేపీ నాయకులకు నేను 100 ఉత్తరాలు రాశాను ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదు. ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదన్నారు.


✳️మన మీద పగ బట్టిన బీజేపీ కి ఓటు ఎందుకు వేయాలి…
ప్రధానమంత్రి మోడీ గారు కేసిఆర్ రైతుల కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్ట మన్నాడు నేను వినకపోయేసరికి రాష్ట్రానికి రావాల్సిన నిధుల నుంచి
రూ,25 వేల కోట్ల కోత విధించిన నేను వినలేదు.


✳️కాంగ్రెస్ ను నమ్మి మోసపోవద్దు…
కాంగ్రెస్ నాయకులు రైతు బంధు వేస్ట్ అంటున్నారు, మీరు ఏమి అంటారు అనగానే సభకు హాజరైన వారందరూ రైతుబంధు కావాలంటూ నినాదాలు చేశారు. రాబోయే రోజుల్లో 16 వేల రైతు బందు వస్తుంది ,కౌశిక్ రెడ్డి ఇక్కడ గెలిస్తే అని అన్నారు. పి సి సి అధ్యక్షుడు 3 గంటల కరెంట్ ఇస్తే చాలు అంటున్నాడు. మీరు ఏమి అంటారు అనగానే 24 గంటలు కావాలని సభకు వచ్చిన వారందరూ ముక్తకంఠంతో చెప్పారు.
ధరణి తీసి బంగాళా ఖాతంలో వేస్తాం అంటున్నారు కాంగ్రెస్ వారు. ధరణి వల్లనే రైతు బంద్ పైసలు మీ ఖాతాలో పడుతున్నాయి. ధరణి తీసేస్తే వైకుంఠం ఆటలో పెద్ద పాము మింగినట్లు బ్రోకర్ వ్యవస్థ ఎక్కువ అవుతుంది. ఇలా ఉంది కాంగ్రెస్ పార్టీ వైఖరి అని అన్నారు. ఇక్కడ ఉప ఎన్నికలో బీజేపీ ఆయన గెలిచి ఏమి చేశాడు. ఏకానా పని అయిందా అని ప్రశ్నించారు.
100 కు వంద శాతం బిఅర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మీరు వేరే పార్టీ కి ఓటు వేస్తే మురిగిపోయినట్లేనని అన్నారు. దళిత బంధు, కాల్వలు, అభివృద్ధి చేసిన కేసిఅర్ కు ఓటు వేయాలన్నారు.
ఇక్కడ ఈటల రాజేందర్ కంటే ముందు బిఅర్ఎస్ జెండా మోసిన వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి తండ్రి పాడి సాయినాథ్ రెడ్డి అని గుర్తు చేశారు.


✳️నా కొడుకు లాంటి వాడు కౌశిక్ రెడ్డి…
హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాడి కౌశిక్ రెడ్డి నా కొడుకు లాంటివాడని, కౌశిక్ రెడ్డి అడిగిన చల్లూరు, వావిలాల, ఉప్పల్, శనిగరం మండలాలు నేను ఏర్పాటు చేస్తాను. నేను దగ్గర ఉండి నేను బాధ్యత తీసుకొని అభివృద్ధి చేస్తాను అని అన్నారు. గతంలో పొరపాటు జరిగింది. ఆ పొరపాటు మరల పునరావృతం కాకుండా కౌశిక్ రెడ్డిని గెలిపించి నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి, మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు, నియోజకవర్గ పరిధిలోని ఎంపీపీలు, జడ్పిటిసిలు, ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు.

✳️ జై కేసీఆర్ నినాదాలతో మార్మోగిన సభ ప్రాంగణం…
ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్లో జమ్మికుంటకు వస్తున్న సమయంలో సభ జరుగుతున్న కాలేజ్ గ్రౌండ్ చుట్టూ హెలికాప్టర్ ఒకసారి చెక్కర్లు కొట్టడంతో సభకు హాజరైన ప్రజలు ఒక్కసారిగా జై కేసీఆర్ అని నినాదాలు చేయడంతో సభా ప్రాంగణం జై కేసీఆర్ నినాదాలతో మారు మోగింది. మధ్యాహ్నం మూడు గంటల 50 నిమిషాలకు జమ్మికుంటకు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు గంటల 58 నిమిషాలకు సభా ప్రాంగణానికి వచ్చారు. నాలుగు గంటల రెండు నిమిషాలకు స్టేజి పైకి రాగా నాలుగు గంటల 7 నిమిషాలకు ప్రసంగాన్ని ప్రారంభించారు. 18 నిమిషాల పాటు మాట్లాడిన కేసీఆర్ ప్రసంగం 4 గంటల 25 నిమిషాలకు ముగిసింది. అనంతరం హెలిప్యాడ్ వద్దకు చేరుకొని నాలుగు గంటల 35 నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా పరకాలకు వెళ్లారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News