Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Kavitha @ Nandipet: ఒకటో నంబర్ ముద్దు ఇంకో నంబర్ వద్దు

Kavitha @ Nandipet: ఒకటో నంబర్ ముద్దు ఇంకో నంబర్ వద్దు

మున్నూరు కాపులు అసలు సిసలైన రైతులు

ఈ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ లో నా కారు గుర్తు మొదటి నంబర్ లో ఉంది. ఒకటో నంబర్ ముద్దు..ఇంకో నంబర్ వద్దు అని ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. నందిపేట్ మండల కేంద్రంలోని మున్నూరు కాపు ఫంక్షన్ హాల్ లో శుక్రవారం జరిగిన మున్నూరు కాపు సోదరుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ నా గెలుపు ఖాయం..కాంగ్రెస్, బీజేపీలు మాయం అని వ్యాఖ్యానించారు.

- Advertisement -

మున్నూరు కాపులు అసలు సిసలైన రైతు బిడ్డలు. ఇది పక్కా రైతు ప్రభుత్వం. ప్రతీ ప్రభుత్వ పథకం మున్నూరు కాపుల ఇంటి ముంగింట్లోకే వస్తోంది. రైతుబంధు,బీమా, 24గంటల ఉచిత విద్యుత్, కల్యాణ లక్ష్మి పథకాలు మున్నూరు కాపులకు వరాలుగా మారాయి. ఆర్మూర్ నియోజకవర్గం ఎలా ఉండాలో అభివృద్ధిని ఈ పదేళ్ళలో చేసి చూపించా. ప్రజలు మెచ్చే విధంగా పనిచేస్తున్న.

ఆర్మూర్ ను రెవెన్యూ డివిజన్ ,ఆర్మూర్ కు వందపడకల ఆసుపత్రి , ఆర్మూర్ లో అభివృద్ధి ఉట్టిపడేలా 11 బైపాస్ రోడ్లు, సిద్ధులగుట్ట కు రూ.20 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఘాట్ రోడ్డు , ఉమ్మెడ- పంచగూడ బ్రిడ్జ్ నిర్మాణం, ఆర్మూర్ పట్టణ ప్రతిష్ట చాటేలా అర్బన్ పార్క్ వంటివి గత ప్రభుత్వాల హయాంలో ఆర్మూర్ నుంచి ప్రాతినిధ్యం వహించిన హేమాహేమీలు చేయలేని పనులివి. ఇలాంటి అసాధ్యమనుకున్న పనులను సుసాధ్యం చేసిన నన్ను మళ్లీ దీవించండి. మళ్లీ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆసరా పెన్షన్లు రూ.5 వేలకు, వికలాంగుల పెన్షన్లు రూ.6వేలకు, రైతు బంధు నిధులు ఎకరాకు రూ.10వేల నుంచి రూ.16వేలకు పెరుగుతాయి. సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలకు రూ. 3వేల భృతి వస్తుంది. రూ.400కే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా జరుగుతుంది.

రూ.5లక్షల చొప్పున ఇంటింటికి బీమా కేసీఆర్ ధీమా పథకం అమలు కానుంది. కేసీఆర్ పాలనలోనే మనకు న్యాయం జరుగుతుంది. ఇక్కడొక ఎంపీ ఉన్నాడు. ఈ ఫంక్షన్ హాలుకు నయా పైసా ఇచ్చిండా?.ఏనాడైనా మిమ్మల్ని ఎలా ఉన్నారని ఆడిగిండా?. మా మున్నూరు కాపుల ఫంక్షన్ హాళ్ల నిర్మాణంలో కవితమ్మే కర్మ,కర్త,క్రియ అని జీవన్ రెడ్డి అన్నారు. కాగా జీవన్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో జీవనన్నకే మా ఓట్లు అంటూ నందిపేట్ మున్నూరు కాపు సోదరులు నినాదాలు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News