కరీంనగర్ లోని కమాన్ పూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు బండి సంజయ్. అనంతరం ఆయన మాట్లాడుతూ కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధికి భూకబ్జాలు తప్ప అభివృద్ధి తెలువదని, అసలు ఆయనకు కరీంనగర్ పైన అవగాహనే లేదని ఆయనతో పాటు బీఆర్ఎస్ అభ్యర్ధి గంగుల కమలాకర్ ఏ ఒక్కరోజైనా కరీంనగర్ ప్రజల కోసం పోరాటాలు చేశారా అని ఏన్నడైనా జైలుకు పోయారా’’అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. తాను నిరంతరం ప్రజల కోసం పోరాడానని, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, మహిళలుసహా అన్ని వర్గాల ప్రజల పక్షాన పోరాడి జైలుకు వెళ్లానని అన్నారు. తాను ప్రజల కోసం కొట్లాడితే తనకు కేసీఆర్ ఇచ్చిన గిఫ్ట 74 కేసులని అన్నారు. ప్రజల కోసం తన కుటుంబాన్ని కూడా పక్కకు పెట్టి పోరాడానని, ఏనాడూ భార్యాపిల్లలకు పూర్తి సమయం కేటాయించలేదని అన్నారు. ప్రజల కోసం, ధర్మం కోసం పోరాడేవారిని గెలిపించకపోతే ఇకపై పేదల పక్షాన పోరాడేవాళ్లు వెనుకంజ వేసే ప్రమాదముందని హెచ్చరించారు. ఎన్నికల్లో భాగంగా కమాన్ పూర్ గ్రామంలో ప్రచారం చేసిన బండి సంజయ్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. నిన్న కేసీఆర్ కరీంనగర్ వచ్చి ఏం మాట్లాడిండు 10 ఏళ్లలో ఏం చేసిండో చెప్పిండా అంటే ఏమీ లేదు. నాకు మతపిచ్చి అట, ఒకసారేమో నా తల ఆరు ముక్కలు చేస్తనంటడు ఆయనకు నేను చెప్పేది ఒక్కటే పేదలకు రేషన్ కార్డులిచ్చి నా తలనరుకు, పేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వు నా తల నరుక్కుంటా, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు, నిరుద్యోగ భ్రుతి ఇవ్వు.. నా తల నరుక్కుంటా, పోనీ పంట నష్ట పరిహారం, కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వు నా తల నరుక్కుంటా అని బండి సంజయ్ అన్నారు. మీ లెక్క నాకూ భార్యాపిల్లలు ఉన్నారు.
మీరు హోటల్ కు, ఫంక్షన్లకు, సినిమాలకు పోతారు కానీ నేను భార్యాపిల్లలతో సినిమాలకు వెళ్లలేదు, ఫంక్షన్లకు పోలేదు. మీకోసం కొట్లాడుతుంటే ప్రత్యర్థులు ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో తెల్వని పరిస్థితి. పాతబస్తీలో సభ పెడితే నా భార్యాపిల్లలను చంపుతామని బెదిరించారు. ప్రజల కోసం ఎంతకైనా తెగించాలని నా కుటుంబాన్ని పక్కనపెట్టి సభ పెట్టిన ఎంపీగా పార్లమెంట్ నియోజకవర్గానికి రూ.8 వేల కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చిన కరీంనగర్-జగిత్యాల , కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి నిర్మాణం కోసం నిధులు తెచ్చిన, స్మార్ట్ సిటీకి నిధులు తెచ్చిన. గ్రామాల్లో జరుగుతున్న అభివ్రుద్ధి నిధులన్నీ కేంద్రానివేనని అన్నారు. మీరు కమలం పువ్వు పై ఓటు వేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరారు.