Friday, November 22, 2024
HomeతెలంగాణSankarpalli: పామేనకు గాజుల గూడెం ఘన స్వాగతం

Sankarpalli: పామేనకు గాజుల గూడెం ఘన స్వాగతం

కాంగ్రెస్ లో ఫుల్ హుషారు

శంకర్ పల్లి మండలం గాజుల గూడెం గ్రామంలో చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పామేన భీమ్ భరత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గాజుల గూడెం గ్రామ మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. పెద్దోళ్ల ప్రశాంత్ రెడ్డి శాలువాతో ఘనంగా సత్కరించారు. గ్రామంలో పెద్దోళ్ల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో భీమ్ భరత్ రోడ్ షో నిర్వహించారు. సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల గురించి ప్రజలకు సవివరంగా వివరించారు. ఈ సందర్భంగా పెద్దోళ్ల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గత తొమ్మిదేళ్లుగా చేవెళ్ల నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధికి నోచుకోలేదని ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని అన్నారు. రోడ్లు మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, బస్సు సౌకర్యం లేక విద్యార్థులు తమ చదువుల కోసం 5 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్తున్నారని బిఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భీమ్ భరత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.

- Advertisement -

“కాంగ్రెస్ గ్యారంటీ కార్డు – అభయ హస్తం”
1) మహాలక్ష్మి పథకం:
మహిళలకు ప్రతీ నెల ₹2500,
కేవలం ₹500 కే వంట గ్యాస్ సిలిండర్,ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణం.
2) రైతు భరోసా పథకం:
ప్రతీ ఏటా రైతులకు & కౌలు రైతులకు ఎకరానికి ఏడాదికి ₹15,000.,₹12,000 వ్యవసాయ కూలీలకు. ,వరి పంటకు క్వింటాల్ కు ₹500 బోనస్.
3) గృహ జ్యోతి పథకం:
ప్రతి కుటుంబానికి ప్రతీ నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్.
4) ఇందిరమ్మ ఇళ్లు పథకం:
ఇల్లు లేని వారికి ఇంటి స్థలం & ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు.,ఉద్యమకారులకు 250 చ.గ ఇంటి స్థలం.
5) యువ వికాసం పథకం:
విద్యార్థులకు ₹5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్.
6) చేయూత:
వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, నేత కార్మికులు, ఎయిడ్స్, ఫైలేరియా బాధితులకు నెలకు రూ.4,000 పింఛన్., పేదలకు 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ భీమా పథకాలే కాకుండా గ్రామాభివృద్ధి కోసం బస్సు సౌకర్యాలను రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు గ్రామాభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News