Sunday, October 6, 2024
Homeహెల్త్Covid: 10 రోజులు..11 వేరియంట్స్..124 మందికి పాజిటివ్

Covid: 10 రోజులు..11 వేరియంట్స్..124 మందికి పాజిటివ్

మనదేశంకి కోవిడ్ కొత్త వేరియంట్లు పెద్ద సంఖ్యలో వచ్చాయి. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం చేసిన తాజా ప్రకటన మనల్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తోంది. అవసరం అయితే తప్ప జనసమూహంలోకి వెళ్లద్దని..వెళ్లినా వ్యక్తిగత శుభ్రత, జాగ్రత్త మరవద్దని కోవిడ్ ప్రోటోకాల్ హెచ్చరిస్తోంది.

- Advertisement -

డిసెంబర్ 23 నుంచి జనవరి 3వ తేదీ మధ్య కాలంలో మనదేశానికి 19.227 మంది ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ వివిధ దేశాల నుంచి వచ్చారు. ఈ 10 రోజుల్లో జరిపిన పరీక్షల్లో వీరిలో 124 మందికి కోవిడ్ లక్షణాలున్నట్టు తేలింది. మొత్తం 11 కరోనా కొత్త వేరియంట్లు మనదేశంలోకి వీరిద్వారా వచ్చాయని తేలింది. కొత్త ట్రావెల్ గైడ్లైన్స్ ప్రకారం.. చైనా, హాంకాంగ్, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్ నుంచి వచ్చే వారికి తప్పకుండా కోవిడ్ టెస్టులు చేస్తున్నారు. ఇక మనదేశంలో రోజూ కొత్తగా 200 కోవిడ్ కేసులు రికార్డు అవుతున్నాయి. హైబ్రీడ్ ఇమ్యూనిటీ వల్ల మనం కొత్త వేరియంట్ల బారిన ఇప్పటివరకూ పెద్దగా పడకపోయినా జాగ్రత్తలు తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News