గత15సంవత్సరాల నుండి ప్రజలు నన్ను కలవాలంటే మధ్యవర్తులు అవసరం లేకుండానే సామాన్య కార్యకర్త నుండి ముఖ్య నాయకులు వరకు ప్రతి ఒక్కరూ నన్ను కలుసుకుంటున్నారని,ఒకప్పుడు ఒక ఎమ్మెల్యే ని కలవాలంటే ముఖ్య నాయకుల ద్వారానో, లేదంటే ఎమ్మెల్యేకి దగ్గరగా ఉండే వ్యక్తులతోనూ మాట్లాడి మీ సమస్యలు చెప్పుకునే పరిస్థితి. కానీ నేను మీ మధ్యనే ఉంటూ సామాన్య ప్రజలు ఫోన్ చేసి నా మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తున్న ఎమ్మెల్యేనని ప్రజలకు, నాకు మధ్య మధ్యవర్తులు అవసరం లేదని మండలంలోని ప్రచారంలో భాగంగా సత్తుపల్లి బి ఆర్ ఎస్ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య అన్నారు.సోమవారం మండల కేంద్రంలోని శాంతినగర్, అంబేద్కర్ నగర్, గోపాలకుంట,గోపాలదేవబోయినపల్లి, వాచ్యానాయక్ తండా, చెన్నూరు, పెద్దకోరుకోండి, చిన్నకోరుకోండి గ్రామాల్లో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి ఆపద వచ్చిన, ప్రజలకు కష్టం వచ్చినా విషయం తెలియగానే వెంటనే స్పందించి వారిని పరామర్శించి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నానని అన్నారు. ప్రజలను పరామర్శించడం నాయకులకు అలవాటు చేసిందే నేనునని అన్నారు. ఎన్నికల సమయంలో కొంతమంది నాయకులు వచ్చి ప్రజలను కల్లబొల్లి మాటలతో మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గ్రామాల్లో స్థానిక నాయకత్వానికి, సార్వత్రిక ఎన్నికలకు సంబంధం లేదని గ్రామాల్లో జరిగే వ్యక్తిగత విషయాలను పరిగణలోకి తీసుకోకుండా అభివృద్ధిని చూసి ఓటేయాలని కోరారు. గ్రామంలో జరిగిన అభివృద్ధి మీ కళ్ళముందే కనబడుతుందని, గత 15 సంవత్సరాలుగా నా చరిత్ర ఏంటో మీకు తెలుసని అన్నారు. నా చరిత్ర మీ ముందు ఉంది. నా భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని నా భవిష్యత్తుకు భరోసాగా నేను చేసిన అభివృద్ధిని చూసి ఆదరించాలని అన్నారు.11సార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు.10సంవత్సరాలలోకేసీఆర్ చేసిన అభివృద్ధి దేశానికే ఆదర్శం అన్నారు. తెలుగుదేశం లో చివరివరకు ఉంది కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారనని నాలుగున్నర సంవత్సరాల కాలంలో 1000 కోట్ల అభివృద్ధిని చేశానని అన్నారు.మీ నాయకుడిగా, మీ కుటుంబ సభ్యుడిగా ఆదరించి నన్ను గెలిపిస్తే సత్తుపల్లి నియోజకవర్గాన్ని కేసీఆర్ సహాయ సహకారాలతో మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. మీ అమూల్యమైన ఓటు ముద్రను కారు గుర్తుపై వేసి రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని, నియోజకవర్గంలో నన్ను గెలిపించాలని ప్రజలను కోరారు. సండ్ర గెలుపు కోసం మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, కొండూరు సుధాకర్ ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఎంపీపీ బీరవల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజయ్ బాబు, మండల పార్టీ అధ్యక్షుడు పాలేపు రామారావు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్కినేని రఘు, సర్పంచ్ లు ,ఎంపీటీసీ సభ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరితరులు పాల్గొన్నారు.
Sandra: మధ్యవర్తులు లేని ఎమ్మెల్యేని
ప్రజా సమస్యలపై పరామర్శలు మొదలుపెట్టిందే నేను