Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan: ఓఎన్జీసీ పైపులైన్‌ ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు 161.86 కోట్ల ఆర్ధిక సాయం...

Jagan: ఓఎన్జీసీ పైపులైన్‌ ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు 161.86 కోట్ల ఆర్ధిక సాయం విడుదల చేసిన జగన్

వర్చువల్ గా బటన్ నొక్కి లబ్దిదారుల అకౌంట్లోకి..

డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23,458 కుటుంబాలకు రూ.161.86 కోట్లను ముఖ్యమంత్రి వైయస్‌. జగన్‌ విడుదల చేశారు. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ పద్ధతిలో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం సీఎం ఇవాళ తిరుపతి జిల్లా మాంబట్టు వద్ద మత్స్యకారులకు మేలు చేసే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

- Advertisement -

తిరుపతి జిల్లా వాకుడు మండలం రాయదరువు వద్ద ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌కు, పులికాట్‌ సరస్సు ముఖద్వారం పునరుద్ధరణ పనుల సహా మరికొన్ని పనులను సీఎం ప్రారంభించారు. అయితే భారీవర్షాల కారణంగా సీఎం తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.

ఓఎన్జీసీ సంస్ధ పైప్‌లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఓఎన్జీసీ ద్వారా నాలుగో విడతగా ఒక్కొక్కరికి నెలకు రూ.11,500 చొప్పున 6 నెలలకుగానూ రూ.69,000, మొత్తం రూ.161.86 కోట్ల ఆర్ధిక సాయాన్ని క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్ నొక్కి వర్చువల్‌గా విడుదల చేసిన సీఎం వైయస్ జగన్.

మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఇతర ఉన్నతాధికారులు హాజరు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News