Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: 815 దేవాలయాల నిర్మాణం, పునరుద్దరణకు 539 కోట్ల సిజిఎఫ్ నిధులు

AP: 815 దేవాలయాల నిర్మాణం, పునరుద్దరణకు 539 కోట్ల సిజిఎఫ్ నిధులు

హథీరాం జీ మఠానికి గతంలో మహంతుగానున్న అర్జున్ దాస్ తొలగింపుకు నిర్ణయం

ఏపిపిఎస్సీ ద్వారా ఎంపికైన 59 మంది గ్రేడ్-3 ఇ.ఓ.ల్లో 54 మందికి నియామక పత్రాలను జారీ చేయడం జరిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. మిగిలిన వారు హాజరు కాకపోవడం వల్ల వారికి నియామక పత్రాలను జారీ చేయలేకపోవడం జరిగిందన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను తెలిపారు.

- Advertisement -

నేడు జరిగిన రాష్ట్ర ధార్మిక పరిషత్ సమావేశంలో తిరుపతి హథీరాం జీ మఠానికి గతంలో మహంతుగా నున్న అర్జున్ దాస్ను తొలిగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో పాటు ఆ మఠానికి చెందిన అన్ని రకాల ఆస్తులను తాత్కాలికంగా నియమించిన ఫిట్ పెర్సన్ అయిన రమేష్ నాయుడుకి అప్పగించాల్సినదిగా ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగిందని తెలిపారు. హథీరాం జీ మఠానికి గతంలో మహంతుగా పనిచేసిన అర్జున్ దాస్ పలు అక్రమాలకు పాల్పడినట్లు త్రిసభ్య కమిటీ విచారణలో స్పష్టం అయిందని, ఆయనపై మోపిన 16 అభియోగాలకు వివరణ ఇవ్వాల్సినదిగా నోటీసు కూడా జారీచేయడం జరిగిందన్నారు. ఈ నెల 16 న జరిగిన ధార్మిక పరిషత్ సమావేశానికి అర్జున దాస్ ఇద్దరు ప్లీడర్లతో హాజరై అభియోగాలపై సరైన వివరణ ఇవ్వకుండా తనను మహంతుగా కొనసాగించాలని కోరడం జరిగిందన్నారు. ఈ విషయంపై నేడు జరిగిన ధార్మిక పరిషత్ సమావేశంలో సమగ్రంగా చర్చించి అతనిని మహంతుగా తొలగించేందుకు ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగిందని తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు, ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలోని పలు దేవాలయాల పునరుద్దరణకు, నూతన దేవాలయాల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత నివ్వడం జరిగిందని ఆయన తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో 815 దేవాలయాల నిర్మాణం మరియు పునరుద్దరణకు రూ.539 కోట్ల సిజిఎఫ్ నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. గతంలో కేవలం 1,621 దేవాలయాలకే పరిమితం అయిన దూపదీప నైవేధ్యం పథకం (డి.డి.ఎన్.ఎస్.) నేడు దాదాపు 8 వేల దేవాలయాల వరకూ విస్తరించడం జరుగుచున్నదన్నారు. శ్రీవాణి ట్రస్టు క్రింద చేపట్టిన 2,872 దేవాలయాల్లో 371 పూర్తి చేయడం జరిగిందని, 1,015 ప్రగతిలో నున్నాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 3,208 మంది అర్చకుల గౌరవ వేతనాన్ని పెంచడం జరిగిందన్నారు. రూ.5 వేల లోపు గౌరవ వేతనం పొందే 1,683 మంది అర్చకులకు రూ.10 వేలకు మరియు రూ.10 వేల లోపు గౌరవ వేతనం పొందే 1,525 మంది అర్చకులకు రూ.15,625/- లకు పెంచడం జరిగిందన్నారు. ఫలితంగా రాష్ట్రంలోని మొత్తం 3,208 మంది అర్చకులకు ప్రతి నెలా రూ.3.87 కోట్లను గౌరవ వేతనంగా చెల్లించడం జరుగుచున్నదని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News