సుమారు అయిదేళ్ల క్రితం కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం దేశంలో చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక, సామాజిక పరమైన విధాన నిర్ణయాలు తీసుకున్నప్పుడు, వాటికి వ్యతిరేకంగా తీర్పులు చెప్పడానికి న్యాయస్థానా లు సిద్ధపడవు. ఇది సాధారణంగా జరిగే విషయమని న్యాయ నిపుణులు కూడా అంగీ కరిస్తారు. ప్రభుత్వ నిర్ణయాలు చట్టవిరుద్ధం, ఏకపక్షం అయితే తప్ప న్యాయస్థానాలు కల్పించుకోవనేది అందరికీ తెలిసిన విసయమే. ఈ విషయాలకే న్యాయస్థానాలు తమ పాత్రను పరిమితం చేసుకుంటూ ఉంటాయి. ఈ నే పథ్యం నుంచి ఆలోచిస్తే, 2016 నవంబర్ 8వ తేదీన కేంద్ర ప్రభుత్వం రూ. 500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ నాటకీయంగా నిర్ణయం తీసుకోవడంపై అయిదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎటువంటి తీర్పు ఇవ్వడానికి అవకాశం ఉందో ఎవరైనా ఊహించవచ్చు.
అప్పుడు చెలామణీలో ఉన్న నోట్లను ఎలా, ఏ విధంగా రద్దు చేశారన్నదానినే న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంటుంది కానీ, ఏ కారణంగా రద్దు చేశారన్న దానికి అది పరిశీలించదు. అది దాని అధికార పరిధిలో లేని విషయం. రద్దు చేసిన విధానంలో ఎటువంటి లోపమూ లేదని, ఇదంతా చట్టబద్ధంగా, న్యా యబద్ధంగానే జరిగిందని ఈ ధర్మాసనంలోని అయిదుగురు న్యాయమూర్తుల్లో నలుగురు న్యాయ మూర్తులు తీర్పు ఇచ్చారు. ఎటువంటి ఆంక్షలూ, ముందస్తు నోటీసులూ లేకుండా నోట్లను రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉందని, చట్ట ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సంప్రదించిన తర్వాతే అది ఈ నిర్ణయం తీసుకుం దని ధర్మాసనం పేర్కొంది. నోట్ల రద్దు కారణంగా అప్పట్లో ప్రజానీ కం పడిన ఇబ్బం దుల గురించి అత్యున్నత న్యాయ స్థానం ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రజానీకం ఇబ్బం దులు పడినా, నోట్ల రద్దు వ్యవహారం చివరికి విఫలం చెందినా అవి కోర్టుకు సంబం ధించిన అంశాలు కాదనే అభిప్రాయం కలుగుతోంది. ఒకవేళ ఇటువంటివి జరిగిన ప్పటికీ, నోట్ల రద్దు నిర్ణయం చెల్లదనడా నికి ఇవి ఏవిధంగానూ దోహదం చేయవని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
అంతుబట్టని కారణం ఇంతకూ నోట్ల రద్దు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఇటువంటి నిర్ణయాన్ని తీసుకుని ఏం సాధించింది? సాధారణంగా అక స్మాత్తుగా నోట్లను రద్దు చేయడం అనేది ప్రజలకు ఇ బ్బంది కలిగించే చర్యే అవుతుంది. రాజకీయాలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటున్న ఈ కాలం లో ఈ చర్య తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి రాజకీయంగా నష్టమే కలిగిస్తుంది. రాజకీయంగా నష్టపో తామని తెలిసి కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఇంత కఠిన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది? ఇవన్నీ ఆలోచించాల్సిన అంశాలే. దేశానికి ఎంతో విపత్తు ముంచుకొస్తుంటే తప్ప ప్రభుత్వం ఇ టువంటి ‘ప్రజా వ్యతిరేక’, ‘రాజకీయంగా నష్టదాయక’ నిర్ణయం తీసుకునే అవకాశమే లేదు. కొన్ని పత్రికలు, ప్రతిపక్షాలు ఎటువంటి వ్యతిరేక ప్రచారం జరిపినప్పటికీ వాటికి ఈ విపత్తేమిటో తెలియదనుకో లేం. ఇంతటి కఠిన నిర్ణయం వల్ల ఏర్పడిన ఇబ్బందులను మౌనంగా భరించి, పరిస్థితిని అర్థం చేసుకున్న అధిక శాతం ప్రజానీకం ఆ తర్వాత కూడా అంటే, 2019లో కూడా బీజేపీనే అధికారంలో కూర్చోబెట్టిన విషయాన్ని తీసిపారేయలేం. ప్రజాస్వామ్య దేశం లో ప్రజల తీర్పే తుది తీర్పు. అదే నిఖార్సయిన తీర్పు.
కొన్ని పత్రికలు గానీ, ప్రతిపక్షాలు గానీ అసలు విషయాన్ని బయటపెట్టి ఉండక పోవచ్చు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం నోట్ల రద్దుకు దారితీసిన కారణాలను సాకల్యంగా వెల్లడించడం జరిగింది. సరిహ ద్దులకు అవతల నుంచి దేశంలోకి కోటా ను కోట్ల రూపాయల నకిలీ కరెన్సీ ప్రవేశించబోతుండడం వల్లే నోట్ల రద్దుకు కేంద్రం పాల్పడవలసి వచ్చిందని సోషల్ మీడియా పేర్కొంది. ఇది నిజమైతే, ఇదే జరిగి ఉ ంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఏమై ఉండేదో అర్థం చేసుకోవచ్చు. నల్లధనాన్ని నియంత్రించడం, ఉగ్రవాదులకు నిధులు అందకుండా అడ్డుకట్ట వేయడం కూడా నోట్ల రద్దుకు కారణ మని సోషల్ మీడియా వెల్లడించింది. ప్రభుత్వాలు కొన్ని వాస్తవాలను వెల్లడించగల స్థితిలో ఉంటాయి. కొన్నిటిని దేశ భద్రత దృష్ట్యా వెల్ల డించలేకపోతాయి. ప్రజలకు ఈ తేడా అర్థమైందనే అర్థం చేసుకోవాలి. న్యాయస్థానాలు కూడా వీటినన్ని టినీ దృష్టిలో పెట్టుకునే తీర్పు ఇస్తాయన్నది అందరికీ తెలిసిన విషయమే.
ఇక నోట్ల రద్దు వల్ల ప్రజలకు ఏర్పడిన ఇబ్బందులను పరిమితం చేయడం, వీలైనంతగా తగ్గించడం, పరిష్కారం చూపించడం వంటి విషయాలకు వస్తే, ప్రజలకు వెసులుబాటు కలిగించడానికి కేంద్రం చేయగలిగినంత చేసిందనడంలో సందేహం లేదు. ఇంత భారీ జనాభా కలిగిన దేశంలో, కొన్ని నిర్ణయాలు ప్రజలకు కొద్దో గొప్పో ఇబ్బంది కలిగించడం సహజమేననుకోవాలి. ఈ అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో న్యాయమూర్తి బి.వి. నాగరత్న మాత్రం ప్రజలు ఎదుర్కొన్న సమస్యల గురించి, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల ప్రజలు ఎదుర్కొన్న అతి దారుణమైన ఇబ్బందుల గురించి ప్రస్తావించారు. ఏది ఏమైనా, ఈ తీర్పు వల్ల ప్రభుత్వం భవిష్య త్తులో ఏ విధానపరమయిన నిర్ణయం తీసుకున్నా, ప్రజలకు తలెత్తే ఇబ్బందుల గురిం చి ముందుగా ఆలోచిస్తుందనే భావించవచ్చు.