మంత్రి హరీశ్ రావు ప్రెస్స్ మీట్ పాయింట్స్..
ఇన్నాళ్లు అబద్దాలతో అదరగొట్టే ప్రయత్నం చేశారు బిజెపి నాయకులు అంటూ మంత్రి హరీష్ నిప్పులు చెరిగారు. మోటార్లకు మీటర్ల అంశంపై నిర్మలా సీతారామన్ గారు కుండ బధ్దలు కొట్టారు. తెలంగాణ బిజెపి నాయకులు, ఓట్ల కోసం ఏం ముఖం పెట్టుకొని తిరుగుతారు. ఈటెల రాజేందర్, రఘునందన్, అరవింద్ ఓట్లు ఎలా అడుగుతారు. మోటార్లకు మీటర్లు పెట్టను అని కరాఖండిగా అసెంబ్లీలో చెప్పిన వ్యక్తి సీఎం కేసీఆర్. నిర్మలా బిజెపితో పాటు కాంగ్రెస్ బండారం బయటపెట్టారు.
ఈ దేశంలో అనేక రాష్ట్రాలు మోటార్లకు మీటర్లు పెడిత్నన్నరు, తెలంగాణ పెట్టలేదు కాబట్టి డబ్బులు ఇవ్వలేదని నిర్మలా స్పష్టంగా చెప్పారు. 12 రాష్ట్రాల్లో ఇప్పటికే మీటర్లు పెట్టారు, మరికొన్ని దరఖాస్తు చేశాయి అన్నాయి. కేసీఆర్ ఉన్నారు కాబట్టి అది ఇక్కడ సాధ్యం కాలేదు. రైతుల పక్షాన నిలబడ్డది ఒక్క కేసీఆర్ మాత్రమే. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో మీటర్లు పెట్టేందుకు అంగీకరించాయి. తప్పిపోయి తెలంగాణలో గెలిస్తే ఇక్కడ కూడా మీటర్లు పెడతారు. 5 గంటల కరెంట్ అని శివకుమార్ బట్టబయలు చేశారు. కాంగ్రెస్, బిజెపి రెండు రైతుల పాలిత శత్రువులు.
యూపీఏ వేసిన స్వామినాథన్ కమిటీని ఆ పార్టీ తుంగలో తొక్కింది. మోడీ గెలవగనే అమలు చేస్తాం అని చెప్పి మోసం చేశారు. స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు కోసం కాంగ్రెస్ ఏనాడైనా పోరాటం చేసిందా. రెండు పార్టీలు రైతులను దగా చేశాయి. బిజెపి పాలిత యుపి, అస్సాం, మణిపూర్ లో మీటర్లు పెట్టారు. ఇండియా కూటమి తమిళనాడు, బెంగాల్, కేరళ లో పెట్టారు. బిజెపి కాంగ్రెస్ సంబంధం లేకుండా ఎపీ, మేఘాలయ వంటివి మీటర్లు పెట్టాయి. దేశంలో మోటార్లకు మీటర్లు పెట్టానని అసెంబ్లీలో ప్రకటించిన ఏకైక రాష్ట్రం, ఏకైక సీఎం కేసీఆర్. 69 లక్షల రైతుల ప్రాణాలు ముఖ్యం, 25 వేల కోట్లు మా ప్రభుత్వానికి ముఖ్యం.
చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా..కాంగ్రెస్ కు ఓటు వేస్తే బాయిల కాడ మీటర్లు పెట్టేందుకు అంగీకరించినట్లే. బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే మీటర్లు పెట్టారు. సాక్ష్యాధారాలతో మాట్లాడుతున్నా.. ఎవరు వస్తరో రండి చర్చకు సవాల్. రైతును నిలబెట్టింది కేసీఆర్, మనం ఇప్పుడు కేసీఆర్ ను నిలబెట్టాలి. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ. 1,24,104 ఉండగా 2023లో రూ.3,17,117 కు పెరిగింది. అంటే రెండున్నర రెట్లు పెరిగింది వాస్తవం కాదా. 2014లో 10వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు మొదటి స్థానానికి ఎదిగింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసిన కృషి వల్ల సాధ్యమైంది. దీనిని ఎందుకు ఒప్పుకోరు?. ఇదే సమయంలో దేశ తలసరి ఆదాయం రూ.1,72,000 మాత్రమే. అంటే తెలంగాణ కన్నా రూ.1,45,000 ఎక్కువ. మీ అసమర్థతను ఎందుకు ఒప్పుకోలేదు. అప్పుల గురించి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చెప్పడం నిజంగా సిగ్గుచేటు.
2014లో కేంద్రంలో మీరు అధికారంలోకి వచ్చేనాటికి దేశం మీద ఉన్న అప్పు దాదాపు రూ.55 లక్షల కోట్లు. ఇప్పుడు రూ.155 లక్షల కోట్లు దాటింది. అంటే ప్రతి నెల దాదాపు లక్ష కోట్లు అప్పు చేసిన ఘనత మీది. మీరు వచ్చి మాకు చెప్పడం గురువింద సామెతను గుర్తు చేస్తోంది. పైగా అప్పులు తగ్గిస్తున్నామని పచ్చి అబద్ధాలు చెప్పడం బాధాకరం. పైగా అప్పులు తగ్గిస్తున్నామని పచ్చి అబద్ధాలు చెప్పడం బాధాకరం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారమే.. జీఎస్టీపీలో తెలంగాణ అప్పుల వాటా 28% మాత్రమే. ఇదే సమయంలో దేశ జీడీపీలో 57 % అప్పులు చేసి దేశాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత మీది కాదా?. రూపాయి విలువ తగ్గించిన ఘనత బిజెపి, నిరుద్యోగ సమస్యలకు కారణం బిజెపి, బీడీ కట్టల మీద పన్ను వేసింది బిజెపి, సిలిండర్ ధరను 400 నుండి 12 పెంచింది బిజెపి.
లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే నేడు మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండుతున్నాయి. పంజాబ్ దాటి అత్యధిక వడ్లు పండే రాష్ట్రం తెలంగాణ. కర్ణాటక నుండి లిక్కర్, లీడర్లు వస్తున్నారు..బియ్యం మాత్రం మనం వారికి పంపుతున్నము. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు. 9 ఏళ్లు అయ్యింది 18 కోట్ల ఉద్యోగాలు ఎవి? శ్వేత పత్రం విడుదల చేయాలి. ఉద్యోగులందరికీ విన్నపం. తప్పుడు ప్రచారం పట్ల తస్మాత్ జాగ్రత.. మనకు పైసలు ఇవ్వకుండా ఆపినట్లు నిర్మలా చెప్పారు. లక్ష కోట్ల దాకా రాకుండా బిజెపి మన మీద కక్ష కట్టింది. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల కొంత జీతాలు ఇవ్వడంలో ఆలస్యం అయ్యింది. కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. మరొకటి లేదు.
కేంద్రంలో మనం కీలక పాత్ర పోషిస్తం. కేసీఆర్ ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం. రాబోయే రోజుల్లో సరి చేస్తాము. మొదటి తేదీన వేతనం ఇచ్చేలా చూస్తాం. రెండు పియార్సిలు ఇచ్చాం. 9 ఏళ్లలో 133 శాతం వేతనాలు పెంచింది బి ఆర్ ఎస్. నాడు జీతాలు, పించనర్ల పై 18 వేల కోట్లు ఖర్చు చేస్తే నేడు 60వేల కోట్లు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు అంగన్వాడీ, ఆశా, వీఏవోలను గుర్రాలతో తొక్కించిన పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ నమ్మితే మోసపోతాం. కాంగ్రెస్ నమ్మితే ఆగం, విఆర్ఎ, ఆర్టీసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేసింది కేసీఆర్. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఎంతోమంది ప్రమోషన్లు డబుల్ ప్రమోషన్లు పొందారు. ఉపాధ్యాయ ఉద్యోగులు, పించనర్లు, చిరు ఉద్యోగులు ప్రభుత్వాన్ని దీవించాలనీ ప్రార్థిస్తున్నా. సిపీఎస్ నుండి ఓపీఎస్ విధానంపై తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ హరీష్ ప్రెస్ మీట్లో వివరించారు.