Saturday, October 5, 2024
Homeహెల్త్Childhood: పిల్లలు బాల్యం నుంచి ఆడకపోతే ఎంత ప్రమాదమో

Childhood: పిల్లలు బాల్యం నుంచి ఆడకపోతే ఎంత ప్రమాదమో

చిన్నతనం నుంచే పిల్లలకు తల్లిదండ్రులు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేయాలి. వాళ్లకు పెట్టే ఆహారంలో పోషకవిలువలు బాగా ఉండేలా జాగ్రత్త వహించాలి. దీని వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాదు వారి ఎముకలు కూడా పటిష్టంగా ఉంటాయి. చిన్నతనం నుంచి యుక్తవయసు దాకా పిల్లల్లో ఎముకలు వేగంగా వ్రుద్ధిచెందుతాయి.18 నుంచి 25 ఏళ్లు వచ్చేటప్పటికి వారిలో బోన్ మాస్ బాగా పెరుగుతుంది. అంటే అప్పటికే శరీరంలో ఎముకల బలం 90 శాతం దాకా వ్రుద్ధిచెంది ఉంటుంది. అందుకే ఎముకల బలం పెరగాలంటే బాల్యం నుంచే వారి డైట్ లో పోషకపదార్థాలు ఉండేలా చూసుకోవాలి. బలమైన తిండి తినడం వల్ల వారి ఎముకలు పుష్టికరంగా తయారవుతాయి. లేకపోతే ఎముకలు బలహీనంగా ఉంటాయి. దీనివల్ల పిల్లలు తరచూ గాయాలపాలయ్యే ప్రమాదం ఉంది.

- Advertisement -

అంతేకాదు ఆస్టియోపొరాసిస్, రికెట్స్ లాంటి ఎముకల జబ్బులు కూడా చిన్నవయసులోనే వస్తాయి. బలవర్థకమైన ఆహారం వల్ల ఎముకలు ద్రుఢంగా ఉంటాయి. ఎముకలు బలంగా ఉండాలంటే తప్పనిసరిగా శరీరానికి డి విటమిన్ అందాలి. నేటి యువతరంలో చాలామంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. చిన్నవయసులోనే రకరకాల ఎముకల జబ్బుల బారిన పడుతున్నారు. అందుకే ఉదయమే కొద్దిసేపు సూర్యకాంతిలో వాళ్లు నడిస్తే శరీరానికి కావలసినంత డి విటమిన్ అందుతుంది. అందుకే పిల్లలకి ఆరుబయట ఎండలో వాకింగ్ చేయడాన్ని చిన్నతనం నుంచే అలవాటు చేయాలి. వారంలో మూడు రోజులు కనీసం పది నిమిషాలు సూర్యరశ్మి తగిలేట్టు నడవడం వల్ల కాళ్లకు, చేతులకు, ముఖానికి కావలసిన డి విటమిన్ అందుతుంది. అలాగే పిల్లలు తినే డైట్ లో వెన్న, ఫాటీ ఫిష్, లివర్ తప్పనిసరిగా ఉండాలి.

పిల్లలకు కాల్షియం ఉన్న పదార్థాలను బాగా పెట్టాలి. కాల్షియం కండరాలను బలోపేతం చేయడమే కాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. పెరుగు, పాలు, జున్ను వంటి వాటిని పిల్లలకు రోజూ పెట్టాలి. వీటిల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. చిన్నారుల చేత రోజుకు కనీసం రెండు గ్లాసుల పాలు తాగించాలి. ఇలా చేయడం వల్ల ఎముకలు వేగంగా పెరుగుతాయి. రోజూ తినే ఆహారంలో ఒక పూట తప్పనిసరిగా పిల్లలకు పెరుగు పెట్టాలి. పాలకూర, బెండ వంటి కాయగూరలను తరచూ పెడుతుండాలి.

విటమిన్ సి కూడా వారికి ముఖ్యం. కమలాపండ్లలో కాల్షియం బాగా ఉంటుంది. సోయాబీన్, సోయాపాలు, సోయా పెరుగు, చేపల్లో కూడా కాల్షియం అధికంగా ఉంటుంది. వీటిని కూడా పిల్లలకు అలవాటు చేయాలి. అలాగే ఎముకలు పటిష్టంగా ఉండాలంటే శరీరానికి విటమిన్ కె, మెగ్నీషియంలు చాలా అవసరం. ఇవి పిల్లలకు రికెట్స్, ఆస్టియోపొరాసిస్ వంటి ఎముకల జబ్బులు రాకుండా కాపాడతాయి. సిరియల్స్ లాంటివి పిల్లలకు పెడితే ఎముకలకు మంచిది. ఇవి శరీరానికి కావలసిన మెగ్నీషియం, పోషకాలను అందిస్తాయి. నేటి డిజిటల్ ప్రపంచంలో పిల్లలు ఆడడం లేదు. శరీరానికి తగినంత శారీరక శ్రమ ఇవ్వడం లేదు.

ఫోన్లు, ఐపాడ్ లు , కంప్యూటర్ల ముందర గంటల తరబడి కూర్చుని సమయం గడిపేస్తున్నారు. ఆటలు అసలే ఆడడం లేదు. ఇలా కదలకుండా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల రకరకాల ఎముకల సంబంధిత జబ్బులు వచ్చే అవకాశం ఉంది. వాకింగ్, జాగింగ్, రన్నింగ్, వ్యాయామాలు చేయడం, యోగా వంటి వాటిని పిల్లలకు చిన్నతనం నుంచే అలవాటు చేయాలి. అప్పుడే వారి శరీరం యాక్టివ్ గా, చురుగ్గా ఉంటుంది. నిత్యం వ్యాయామాలు చేయడం వల్ల ఎముకల్లోని కణాలు వ్రుద్ధిచెందుతాయి కూడా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News