Monday, November 25, 2024
Homeహెల్త్Anti Aging: ఏజింగ్ అస్సలు రానివ్వని కలబంద

Anti Aging: ఏజింగ్ అస్సలు రానివ్వని కలబంద

అలోవేరా మొక్కలు కొన్ని ఇంట్లో పెంచుకోండి, ఇది మీకు యాంటీ ఏజింగ్ ఏజెంట్

అలొవిరాతో అందాలొలికే చర్మం..
అలొవిరా (కలబంద) జుట్టును, చర్మాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. అందంగా, ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది. కలబంద గుజ్జులో కాస్త నిమ్మరసం కలిపి ముఖం, మెడ, చేతులపై రాసుకుంటే నలుపుదనం తగ్గుతుంది. అంతేకాదు ఈ ఆకు గుజ్జులో గులాబీ రసం కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం ఎంతో తాజాగా ఉంటుంది. అలాగే కలబంద గుజ్జులో కొంచెం పసుపు, తేనె, మీగడతో పాటు గులాబీ రసం కలిపి పేస్టులా చేసి దానిని ముఖానికి పూతలా వేసుకోవాలి. అది ఆరిపోయేవరకూ అలాగే ఉంచి ఆ తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీళ్లతో కడుక్కోవాలి. దీంతో పిగ్మెంటేషన్ మచ్చలు, కాలిన గాయాలు, మొటిమల తాలూకు మచ్చలు అన్నీ పోతాయి.

- Advertisement -

కలబందతో చర్మం ఎంతో కాంతివంతమవుతుంది కూడా. వేపాకులను నీటితో కడిగి బాగా నూరాలి. అందులో అలొవిరా జెల్, తేనె వేసి మెత్తటి పేస్టులా చేయాలి. అవసరమైతే కొద్దిగా నీరు ఇందులో కలుపుకోవచ్చు. అలా ఫేస్ ప్యాక్ గా తయారు చేసిన ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని పదిహేను నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత నీటితో కడిగేసుకోవాలి. అది చర్మంపై చూపే ప్రభావం ఎంతో. అలొవిరా జెల్ చర్మాన్ని హైడ్రేటింగ్ గా ఉంచుతుంది. చర్మానికి మంచి మాయిశ్చరైజర్ గా పనిచేయడమే కాదు చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. ఇందులో యాంటిమైక్రోబియల్ సుగుణాలు కూడా ఉన్నాయి. ఇవి చర్మాన్ని యాక్నే, మొటిమల బారిన పడకుండా సంరక్షిస్తాయి. చర్మాన్ని బిగువుగా ఉంచుతాయి.

ఒక టేబుల్ స్పూన్ అలొవిరా జెల్, ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ తీసుకుని రెండింటినీ కలిపి పేస్టులా చేసి ముఖానికి రాసుకుంటే చర్మం శుభ్రంగా అయి తాజాదనంతో మెరిసిపోతుంది. చర్మంపై ఉండే మృతకణాలు పోతాయి. ముల్తానీమట్టి, అలొవిరా జెల్ కలిపిన ఫేస్ ప్యాక్ చర్మానికి ఎంతో మంచిది. ఒక
టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, ఒక టీ స్పూన్ అలొవిరా జెల్, రోజ్ వాటర్ లేదా చల్లటి పాలు ఈ మూడింటినీ కలిపి పేస్టులా చేసి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేస్తే చర్మంలోని మలినాలన్నీ పోవడమేకాదు చర్మంలోని అదనపు నూనె కూడా పోతుంది. నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్, ఆయిలీ
స్కిన్ వాళ్లకు ఈ ఫేస్ మాస్కు సరిపడుతుంది. మెరిసే, కాంతివంతమైన చర్మం కావాలంటే అలొవిరా, పసుపు మిశ్రమం బాగా పనిచేస్తుంది.

అన్ని రకాల స్కిన్ టైప్ వారికి, చివరకు సెన్సిటివ్ స్కిన్ వారికి కూడా ఈ ఫేస్ ప్యాక్ బాగా పనిచేస్తుంది.
చిటికెడు పసుపు, ఒక టేబుల్ స్పూన్ అలొవిరా జెల్, ఒక టీస్పూన్ తేనె, కొన్ని చుక్కల రోజ్ వాటర్ వీటన్నింటినీ కలిపి పేస్టులా చేసి ముఖానికి పట్టించి 20 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత సాధారణ
నీటితో ముఖం కడుక్కుంటే చాలు. స్కిన్ ఆరోగ్యంగా ఉండాలంటే అలొవిరా జెల్, అరటిపండు ఫేస్ ప్యాక్
బాగా పనిచేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ అలొవిరా జెల్ లో మూడు లేదా నాలుగు బాగా పండిన అరటిపండు ముక్కలు వేసి మెత్తటి పేస్టులా చేసి ముఖానికి రాసుకుని కాసేపైన తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. అలొవిరా, పెరుగు ఫేస్ ప్యాక్ చర్మాన్ని బాగా శుభ్రం చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ అన్ని రకాల స్కిన్ టైప్స్ కి సరిపడుతుంది. చర్మంపై చేరిన మురికి, మలినాలను ఈ ప్యాక్ పూర్తిగా పోగొడుతుంది.

రెండు టీస్పూన్ల అలొవిరా జెల్ లో ఒక టీస్పూన్ పెరుగు, ఒక టీస్పూన్ తేనె లేదా నిమ్మరసం వేసి కలిపి పేస్టులా చేసి దాన్ని ముఖానికి రాసుకోవాలి. పెరుగు మంచి స్కిన్ క్లీన్సర్. చర్మాన్ని ఎక్స్ ఫొయిలేట్ చేసే మైల్డ్ యాసిడ్స్ కూడా పెరుగులో ఉంటాయి. ఇవి చర్మంపై చేరిన మలినాలను పోగొడతాయి. పెరుగులోని హెల్దీ ఫ్యాట్స్ చర్మాన్నిబాగా మెరిసేలా చేస్తాయి. ఈ ప్యాక్ డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్ ఉన్న వారందరికీ సరిపడుతుంది కూడా. ట్యాన్, స్కిన్ బర్న్స్ ఉన్న వారికి అలొవిరా,
కీరకాయ మిశ్రమంతో చేసిన ఫేస్ ప్యాక్ బాగా పనిచేస్తుంది. రెండు టీస్పూన్ల అలొవిరా జెల్, ఒక టీస్పూన్ కీరకాయ జ్యూసు, రెండు లేదా మూడు చుక్కల రోజ్ వాటర్ మూడింటినీ కలిపి పేస్టులా చేసి దాన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి.

ఇరిటేటెడ్, సన్ బర్న్ స్కిన్ పై కీరకాయ రసం బాగా పనిచేస్తుంది. చర్మానికి ఎంతో సాంత్వననిస్తుంది. కీరకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది చర్మానికి కావలసినంత హైడ్రేషన్ ను అందిస్తుంది. చర్మంపై చేరిన జిడ్డు, మలినాలు, మట్టిని ఈ ప్యాక్ పోగొడుతుంది. దీంతో చర్మం ఎంతో తాజాగా, మరింత మెరుస్తూ కాంతివంతంగా కనిపిస్తుంది. సెన్సిటివ్ స్కిన్ నుంచి అన్నిరకాల చర్మ స్వభావం వారికీ ఈ ఫేస్ మాస్కు బాగా సరిపడుతుంది. అలొవిరా, బొప్పాయి ఫేస్ మాస్కు కూడా చర్మానికి ఎంతో మంచిది.
బొప్పాయిలోని ఎంజైములు సహజసిద్ధమైన కెమికల్ ఎక్స్ పొయిలెంట్ గా పనిచేస్తాయి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల చర్మంపైన ఉండే మురికి పోయి చర్మం కాంతివంతమవుతుంది. ఈ ప్యాక్ చర్మాన్ని ఎంతో మృదువుగా ఉండేలా చేస్తుంది కూడా. నార్మల్ స్కిన్, ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్, మెచ్యూర్ స్కిన్లకు ఈ ప్యాక్ సరిపడుతుంది.

పండిన బొప్పాయి ముక్కలు రెండు లేదా మూడు తీసుకుని మెత్తగా చేసి అందులో రెండు స్పూన్ల అలొవిరా జెల్, రెండు టీస్పూన్ల రోజ్ వాటర్ వేసి పేస్టులా చేసి దాన్ని ముఖానికి పట్టించుకోవాలి. అలొవిరా జెల్, శాండల్ ఉడ్ పౌడర్ మిశ్రమాన్ని నిత్యం ముఖానికి పట్టించుకోవడం వల్ల చర్మం తెల్లగా , మృదువుగా
తయారవుతుంది. ఒక టేబుల్ స్పూన్ అలొవిరా జెల్, ఒక టేబుల్ స్పూన్ శాండల్ వుడ్ పొడి, రోజ్
వాటర్ లేదా చల్లటి పాలు మూడింటినీ కలిపి పేస్టులా చేసి ముఖానికి రాసుకోవాలి. ఆ ప్యాక్ ను పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచుకుని ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News