Friday, November 22, 2024
Homeహెల్త్Moisturiser: లైట్ వెయిట్ డ్రై స్కిన్ మాయిశ్చరైజర్

Moisturiser: లైట్ వెయిట్ డ్రై స్కిన్ మాయిశ్చరైజర్

చలికాలంలో చర్మం తొందరగా పొడారిపోతుంటుంది. ఇరిటేటింగ్ గా కూడా ఉంటుంది. మాయిశ్చరైజర్లు ఈ సమస్యను పరిష్కరించడమే కాదు చర్మాన్ని మ్రుదువుగా ఉండేలా చేస్తాయి. ముఖ్యంగా మీది పొడి చర్మమైతే దాని కోసం ప్రత్యేకంగా కొన్ని మాయిశ్చరైజర్లు ఉన్నాయి. వాటిల్లో మినిమలిస్ట్ 3 % సెపికామ్ ఫేస్ మాయిశ్చరైజర్ ఒకటి. ఇది లైట్ వైట్ మాయిశ్చరైజర్. పొడి చర్మానికి కావాలసినంత తేమను ఇది అందిస్తుంది. చర్మాన్ని పట్టులా ఉంచుతుంది. చర్మానికి జిడ్డుతనం లేకుండా చేస్తుంది. ముఖం మెరుస్తుంటుంది. ఇందులో ఓట్ ఎక్స్ ట్రాక్స్ట్ ఉంటాయి. వాటితో పాటు విటమిన్ బి5, ఎమినోయాసిడ్స్ వంటివి కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతం చేయడమే కాకుండా చర్మం ఇరిటేషన్ కు గురికాకుండా సంరక్షిస్తుంది.

- Advertisement -

న్యూట్రోజినా ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్ ఇంకొకటి. ఇది కూడా చలికాలంలో పొడి చర్మంతో బాధపడేవారికి ఎంతో పనికివస్తుంది. ఇందులో ఎస్ పి ఎఫ్ 15 ఉంటుంది. ఇది సూర్యరశ్మి నుంచి రక్షించడమే కాకుండా చర్మానికి ఎక్కువ సేపు మాయిశ్చరైజర్ ని అందజేస్తుంది. ఇది తేలికపాటి మాయిశ్చరైజర్. దీంట్లో జిడ్డు గుణం అస్సలు ఉండదు. నివియా సాఫ్ట్ లైట్ మాయిశ్చరైజర్ క్రీము కూడా పొడి చర్మంపై బాగా పనిచేస్తుంది. విటమిన్ ఇ, జొజొబా తైలం ఇందులో ఉన్నాయి. ఇది తేలికపాటి మాయిశ్చరైజర్. దీన్ని రాసుకుంటే చర్మం ఎంతో తాజాగా ఉంటుంది. ఇది చర్మాన్ని మ్రుదువుగా, సిల్కీగా ఉంచుతుంది. సిటాఫిల్ మాయిశ్చరైజింగ్ క్రీము కూడా పొడిచర్మంతో బాధపడేవారికి బాగా పనిచేస్తుంది. ఇది రాసుకుంటే చాలా గంటల పాటు చర్మం తేమగా ఉంటుంది. ఈ క్రీములో బాదం తైలం, విటమిన్ ఇ ఉంటాయి. ఇవి చర్మంలోని సహజ తేమ గుణాన్ని బయటకు తెస్తాయి.

డాట్ అండ్ కీ విటమిన్ సి+హలురోనిక్ యాసిడ్ మాయిశ్చరైజర్ ఇంకొకటి. ఇది చర్మంపై ఏర్పడ్డ మొటిమలను, నల్లటి మచ్చలను పోగొడుతుంది. దీన్ని వాడడం వల్ల చర్మం సమతుల్యమైన టోనింగ్ ని కలిగి ఉండడమే కాదు ఎంతో కాంతివంతంగా ఉంటుంది. చర్మం ఎక్కువ సమయం తేమదనాన్ని కలిగి ఉంటుంది. పొడిచర్మం ఉన్న వాళ్లు రిక్విల్ సెరమైడ్ హలురోనిక్ యాసిడ్ మాయిశ్చరైజర్ ను రాసుకుంటే చర్మం అల్ట్రాస్మూద్ నెస్ తో నిగ నిగలాడుతుంటుంది. చర్మం సున్నితంగా ఉంటుంది. చర్మంలో తేమదనం పోకుండా ఈ క్రీము పొరలా సంరక్షిస్తుంది. చర్మం హైడ్రేటెడ్ గా ఉండేలా చేస్తుంది. ఎలర్జీల బారిన పడకుండా ముందుగానే చర్మ నిపుణులను సంప్రదించి ఈ క్రీములను వాడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News