ఈమెయిల్ అడ్రస్సులు భారీ ఎత్తున లీక్ అయ్యాయి. 200 మిలియన్ల ట్విట్టర్ యూజర్స్ డేటా లీక్ అయ్యాయనే విషయం సోషల్ మీడియా యూజర్స్ కు షాక్ ఇస్తోంది. దీంతో డాక్సింగ్, టార్గెటెడ్ పిషింగ్, హ్యాకింగ్ వంటివి జరగటం ఖాయమని ఇజ్రాయిలీ సంస్థ హడ్సన్ రాక్ వెల్లడించింది. దీనిపై ట్విట్టర్ మాత్రం ఇప్పటి వరకూ స్పందించకపోవటంతో ట్విట్టరటీలు టెన్షన్ లో ఉన్నారు. అయితే సుమారు 400 మిలియన్ ట్విట్టర్ యూజర్స్ ఈమెయిల్ అడ్రస్సులు, ఫోన్ నంబర్స్ లీక్ అయినట్టు సమాచారం. యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఈమొత్తం విషయంపై మానిటరింగ్ చేస్తోంది. ఈ పురోగతి సంగతిని కూడా ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ ఇప్పటి వరకు వెల్లడించలేదు.
Data breach: 200 మిలియన్ ట్విట్టర్ యూజర్స్ డేటా లీక్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES