దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని దుండిగల్, గాగిలాపూర్, నాగులూరు లలో కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ ఎన్నికల ప్రచారం సాగింది. బీజేపీ ప్రచారానికి పెద్ద ఎత్తున ప్రజలు విచ్చేసి, కూన శ్రీశైలం గౌడ్ కి మద్దతుగా నిలిచారు. పేదలకు ఇండ్లు, రేషన్ కార్డులు పెన్షన్లు ఇండ్ల పట్టాలు ఇప్పించే బాధ్యత తనదని బిజెపి అభ్యర్థి శ్రీశైలం గౌడ్ తెలిపారు.ఈనెల 30 తేదీన జరిగే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లారెడ్డి ,స్థానిక బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్ 131 డివిజన్ లోని వెంకటేశ్వర నగర్, ఇంద్ర సింగ్ నగర్, వాణి నగర్, మహేందర్ నగర్, కాకతీయ నగర్, అంబేద్కర్ నగర్, చెరుకుపల్లి కాలనీలలో కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ ఇంటింటికి తిరుగుతూ, ఎన్నికల ప్రచారం చేపట్టారు.
ఈ నెల 30 న జరిగే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి, తనని గెలిపించాలని ఓటర్లను కోరారు.కుత్బుల్లాపూర్ డివిజన్ లో బీజేపీ ప్రచారానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి, కూన శ్రీశైలం గౌడ్ కు మద్దతుగా గెలిచారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ,కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని, కాంగ్రెస్ కి ఓటేస్తే ఎన్నికలయ్యాక కెసిఆర్ పార్టీలో చేరుతారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పని ఖతమైందని, ప్రజలంతా బిజెపి వైపే ఉన్నారని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఆయన తన హామీలను ప్రజలకు వివరించారు. బస్తీలలో మౌలిక సౌకర్యాలతో పాటు, పేదలకు ఇండ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ ఉద్యమకారులందరినీ గౌరవించుకుంటామని వారికి ఇండ్లు పెన్షన్లు ఇప్పిస్తామని అన్నారు. కార్మికుల సంక్షేమ కొరకు ప్రత్యేక సంక్షేమ బోర్డును కుత్బుల్లాపూర్ లో ఏర్పాటు చేస్తామని, జీడిమెట్ల ఈఎస్ఐ ఆసుపత్రిని ఆధునీకరించి, ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆసుపత్రికి దీటుగా అందరికీ అందుబాటులోకి తెస్తామని అన్నారు. అన్ని కుల సంఘాలకు సంక్షేమ భవనాలు ఏర్పాటు చేస్తామని, పేదలు శుభకార్యాలు చేసుకునేందుకు ప్రైవేటు ఫంక్షన్ హాల్స్ కు దీటుగా మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్స్ నిర్మించే పేదలకు ఉచితంగా అందుబాటులోకి తీస్తామని తెలిపారు. ఐడిపిఎల్ చౌరస్తా నుండి గడ్డి మైసమ్మ వరకు ఫ్లై ఓవర్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈనెల 30వ తారీకు జరిగే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రచారంలో స్థానికంగా నెలకొన్న సమస్యలను తెలుసుకోవడంతోపాటు, వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.