హాకీని ఒరిస్సా ప్రభుత్వం పోషిస్తున్న విధానంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. FIH ఒడిస్సా హాకీ మెన్స్ వల్డ్ కప్ 2023 నేపథ్యంలో ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. హాకీ వల్డ్ కప్ గెలిస్తే ఇండియన్ హాకీ టీలోం ప్రతి ఒక్క ఆటగాడికి కోటి రూపాయలు ఇస్తామని నవీన్ ప్రకటించారు. రూర్కెలాకు వెళ్లి హాకీ వల్డ్ కప్ సన్నాహక కార్యక్రమాలను ఆయన పర్యవేక్షించారు. రూర్కెలా లోని బిర్సా ముండా హాకీ స్టేడియం కాంప్లెక్స్ లో వల్డ్ కప్ విలేజ్ ను ప్రారంభించారు. కేవలం 9నెలల రికార్డు టైంలో ఈ యావత్ వల్డ్ కప్ గ్రామాన్ని రూపొందించటం విశేషం. ఇందులో 225 రూములతో పాటు క్రీడాకారులకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించారు. తాజ్ గ్రూప్ సాయంతో ఇక్కడ వల్డ్ క్లాస్ సదుపాయాలు కల్పించారు.