కొండపాక మండల కేంద్రానికి అతి సమీపంలో రాజీవ్ రహదారి పక్కన ఆనంద నిలయం ప్రాంగణంలో శ్రీ ఉమా రామలింగేశ్వర అష్టాదశ శక్తి పీఠాలు అంగరంగ వైభవంగా వేద బ్రాహ్మణోత్తములచే శాస్త్ర యుక్తంగా శ్రీ పుష్పగిరి పీఠాధిపతులు (జగద్గురువులు) శ్రీ శ్రీ శ్రీ అభినవొద్దండ విద్యా శంకర భారతి స్వామి ఆధ్వర్యంలో ఉదయం 4:30 నిమిషాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి పర్యవేక్షణలో భక్తజనుల సమక్షంలో శక్తి పీఠాల అమ్మవారల విగ్రహాల ప్రతిష్ట శాస్త్ర యుక్తంగా జరిగింది.
ఈ సందర్భంగా భారతి స్వామి మాట్లాడుతూ తన యొక్క గురువు దయ వల్ల ఎన్నో దేవతల గుడుల ప్రతిష్ట చేశామని.. ఆ దేవాలయాలన్నీ నిత్యం కళకళలాడుతూ భక్తజనుల సందోహంతో విరాజిల్లుతున్నవని ఈ అష్టాదశ శక్తిపీఠ ఉమా సహితరామలింగేశ్వర ప్రతిష్ట జరిగిందని ఈ దేవాలయం కూడా ఎంతో ప్రసిద్ధిలోకి వస్తుందని భక్తజనులు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి తందోపతండాలుగా వస్తారని తెలిపారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ శక్తిపీఠ ప్రతిష్టకు పరిసర ప్రాంతాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ భక్తి ని చాటుకున్నారు దేవతామూర్తుల ప్రథమ సందర్శన అనంతరం భక్తజనులకు అన్న ప్రసాదం చేశారు.
దేవాలయపరిసర ప్రాంతాలు భక్త జనులచే నిండి ఆ ప్రాంతమంతా జన సమూహంతో కలకలలాడింది. రాబోయే కాలంలో ఈ దేవాలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన భారతీ స్వామి తన ఉపన్యాసంలో తెలియజేశారు.
ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చలువ పందిర్లు మంచినీటి సౌకర్యంతో వచ్చిన భక్తులకు భోజనాదికాలతో ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు.