పొత్తికడుపు కొవ్వు కరిగించే డిటాక్స్ డ్రింకు
తులసి, అల్లం, తేనె కలిపి చేసే డిటాక్స్ డ్రింకును ఎప్పుడైనా తాగారా? బరువును తగ్గించే రకరకాల డిటాక్స్ వాటర్స్ గురించి వినే ఉంటారు. అలాంటి వాటిల్లో తులసి, అల్లం, తేనె డిటాక్స్ డ్రింకు ఎంతో బెస్ట్ అని పోషకాహార నిపుణులు సైతం అంటున్నారు. ఈ డ్రింకు పొత్తికడుపు చుట్టూ ఉన్న కొవ్వును
తగ్గిస్తుంది. ఈ డ్రింకులో వాడే తులసి పొత్తికడుపు దగ్గర చేరిన కొవ్వును తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. తులసిలో ఇజినల్ అనే ఎసెన్షియల్ ఆయిల్ ఉంది. మన జీర్ణాశయ ద్వారం, కీళ్ల బాధలను తగ్గించడంలో ఈ ఆయిల్ లోని యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు బాగా పనిచేస్తాయి.
తులసిలో యాంటాక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఫ్రీరాడికల్స్ వల్ల శరీరం దెబ్బతినకుండా ఇవి కాపాడతాయి. రోజూ ఉదయం ఐదారు తులసి ఆకులను నీళ్లల్లో వేసుకుని తాగితే అంత మంచి డిటాక్స్ డ్రింకు మరొకటి లేదని ప్రముఖ వైద్యులు సైతం చెపుతున్నారు. అంతేకాదు ఈ డ్రింకు మెటబాలిజాన్ని కూడా బాగా పెంపొందిస్తుంది. అంతేకాదు తులసి ఆకులు శరీరంలోని కాలరీలను కరిగించడమే కాకుండా శరీరంలో చేరిన విషతుల్యమైన పదార్థాలను సైతం అత్యంత సహజంగా బయటకు పంపేస్తాయి కూడా.
ఇక ఇందులో ఉపయోగించే అల్లం విషయానికి వస్తే అల్లంలో జింజరాల్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఇది డైజిస్టివ్ ఎంజైములను బాగా ఉత్తేజితం చేస్తుంది. జీర్ణశక్తిని మరింతగా మెరుగుపరుస్తుంది. దీనివల్ల
కడుపులో పోట్లు తగ్గడమే కాకుండా జీర్ణాశయం కూడా ఆరోగ్యంగా పనిచేస్తుంది. అంతేకాకుండా శరీరంలో ఉన్న అదనపు కొవ్వును ఇది పోగొడుతుంది. ఇలాంటి ఎంతో శక్తివంతమైన డిటాక్స్ టీని ఎలా తయారుచేయాలి అని ఆలోచిస్తున్నారా? చాలా సింపుల్.
ఐదు లేదా ఆరు తాజా తులసి ఆకులు తీసుకోవాలి. ఒక అంగుళం సైజు ఉన్న అల్లం కూడా తీసుకోవాలి. ఈ రెండింటినీ గ్లాసుడు నీళ్లల్లో వేసి పొయ్యి మీద పెట్టి ఆ నీళ్లు సగం గ్లాసువరకూ వచ్చేదాకా మరిగించాలి. బాగా ఉడికిన ఆ నీళ్లను వొడగొట్టి ఉదయం లేచిన వెంటనే తాగాలి. ఆ టీకి ఫ్లేవర్ కావాలని కోరుకునేవాళ్లు
కొద్దిగా తేనెను అందులో కలుపుకుని తాగొచ్చు. ఇలా నిత్యం ఉదయం లేచిన వెంటనే ఈ డిటాక్స్ డ్రింకు తాగడం వల్ల మీ శరీరం బరువు తగ్గుతారు. అయితే ఈ టీని అతిగా కాకుండా తగినంత మాత్రమే తీసుకోవాలని మరవొద్దు. మీ డైలీ రొటీన్ లో ఈ డ్రింకును భాగస్వామ్యం చేసి తీసుకోవడం వల్ల మీ బరువు
తగ్గడంలో మంచి పురోగతి చూస్తారు.