Friday, November 22, 2024
Homeహెల్త్Super paste: సూపర్ మ్యాజిక్ చేసే పేస్ట్

Super paste: సూపర్ మ్యాజిక్ చేసే పేస్ట్

సైడ్ ఎఫెక్ట్స్ లేని ..

తేనె, దాల్చిన చెక్కల పేస్టుతో ఎన్ని లాభాలో…
తేనె, దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకుంటే పొందే ఆరోగ్య లాభాలు తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ మిశ్రమంతో ఎన్నో జబ్బులు మన దరికి చేరవు. మీ ఆరోగ్యం కూడా సూపర్ గా ఉంటుంది.

- Advertisement -

తేనె, దాల్చిన చెక్క మిశ్రమం తీసుకోవడం వల్ల రకరకాల జబ్బుల బారిన పడకపోవడమే కాకుండా దీనివల్ల
పొందే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో అని పలు అధ్యయనాల్లో సైతం వెల్లడైంది. దీనివల్ల మధుమేహ వ్యాధిగ్రస్థులతో సహా ఎవ్వరికీ ఎలాంటి సైడెఫెక్టులు తలెత్తవు కూడా.

ఆ లాభాలేమిటంటే..
-ఈ మిశ్రమం తీసుకోవడం వల్ల గుండె జబ్బుల బారిన పడరు. ఉదయం మీరు తినే టోస్ట్ మీద ఈ మిశ్రమాన్ని రాసుకుని బ్రేక్ ఫాస్ట్ గా తినొచ్చు. ఇలా తినడం వల్ల గుండె బలంగా, మరెంతో ఆరోగ్యంగా తయారవుతుంది. అంతేకాదు శరీరంలోని కొలెస్ట్రాల్ ప్రమాణాలను సైతం ఈ మిశ్రమం తగ్గిస్తుంది. గుండెపోటు రిస్కు ఉండదు.

  • ఆర్తైటిస్ నొప్పుల నుంచి కూడా తేనె, దాల్చినచెక్క పొడి మిశ్రమం సాంత్వననిస్తుంది. ఒక కప్పు వేడి నీళ్లు తీసుకుని అందులో రెండు టీస్పూన్ల తేనె, ఒక చిన్న చెంచాడు దాల్చినచెక్క పొడి అందులో వేసి బాగా కలిపి ఆ సొల్యూషన్ ని నిత్యం తాగితే మీకున్న క్రానిక్ ఆర్రైటిస్ నొప్పులు తగ్గుతాయి.
  • ఈ మిశ్రమం బ్లాడర్ ఇన్ఫెక్షన్లను కూడా తగ్గించే మంచి మెడిసెన్. రెండు టీస్పూన్ల దాల్చిన చెక్క పొడి, ఒక టేబుల్ స్పూన్ తేనెలను కాస్త వేడిగా ఉన్న ఒక గ్లాసుడు నీళ్లల్లో వేసి బాగా కలపాలి. ఈ డ్రింకును నిత్యం తాగితే గాల్ బ్లాడర్ లోని బాక్టీరియా నశిస్తుంది.
  • ఈ మిశ్రమం తీసుకోవడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ ప్రమాణాలు కూడా తగ్గుతాయి. రెండు టీస్పూన్ల తేనె, మూడు టీస్పూన్ల దాల్చినచెక్క పొడి 16 ఔన్సుల టీ నీళ్లల్లో కలిపి ఆ సొల్యూషన్ ని తాగితే అది మీ కొలెస్ట్రాల్ ప్రమాణాలను క్రమబద్ధీకరించడమే కాదు రెండు గంటల్లో పది శాతం కొలెస్ట్రాల్ ప్రమాణాలను ఈ మిశ్రమం తగ్గిస్తుంది. క్రానిక్ కొలెస్ట్రాల్ పేషంట్లకు ఇది ఎంతో మంచిది.
  • జలుబు, దగ్గులను కూడా ఈ మిశ్రమం తగ్గిస్తుంది. జలుబు లేదా దగ్గుతో బాధపడుతున్న వారు గోరువెచ్చగా చేసిన టీస్పూను తేనెలో పావు టీస్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలపాలి. ఈ పేస్టును మూడు రోజులు వరుసగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల దగ్గు, జలుబు తగ్గడమే కాదు సైనస్ సమస్య కూడా పరిష్కారమవుతుంది.
  • పొట్ట పాడైతే కూడా ఈ మిశ్రమం మంచి మెడిసెన్ లా పనిచేస్తుంది. నిత్యం తేనె, దాల్చినచెక్క పొడి మిశ్రమం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఈ మిశ్రమాన్ని నిత్యం తీసుకోవడం వల్ల బాక్టీరియల్, వైరల్ అటాక్స్ కు మీ శరీరం లోనుకాదు. తేనెలో విటమిన్లతో పాటు ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. అందుకే ఈ మిశ్రమాన్ని నిత్యం తీసుకోవడం వల్ల రకరకాల వైరల్ జబ్బులపై సైతం శక్తివంతంగా పోరాడగలుగుతాం. జీవితకాలం పెరుగుతుంది కూడా.
  • జీర్ణశక్తికి సంబంధించిన సమస్యలను కూడా ఈ మిశ్రమం నివారిస్తుంది. రెండు టీస్పూన్ల తేనెలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలిపి ఆ మిశ్రమాన్ని భోజనానికి ముందు తీసుకోవాలి. ఇలా చేస్తే మీ జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది. ఎసిడిటీ సమస్య నుంచి కూడా ఈ పేస్టు సాంత్వననిస్తుంది.
  • మూడు కప్పుల ఉడుకుతున్న నీళ్లల్లో నాలుగు టేబుల్ స్పూన్ల తేనె, ఒక టీస్పూను దాల్చినచెక్క పొడి వేసి టీ చేయాలి. రోజుకు నాలుగుసార్లు ఈ టీ పావు కప్పు తాగాలి. ఈ డ్రింకు మీ చర్మాన్ని మెరిపించడమే కాదు మీ స్కిన్ ఎంతో యూత్ ఫుల్ నెస్ తో కాంతివంతంగా తయారవుతుంది కూడా. మీరు ఎప్పుడూ యవ్వనోత్సాహంతో ఉంటారు. అంతేకాదు సుదీర్ఘకాలం బతుకుతారు కూడా.
  • దాల్చినచెక్కపొడి, తేనె మిశ్రమం గొంతునొప్పిని కూడా తగ్గిస్తుంది. ఒక టీస్పూను తేనె తీసుకుని గొంతునొప్పి తగ్గేవరకూ దాన్ని మెల్లగా సిప్ చేయాలి. ప్రతి మూడు గంటలకు ఒకసారి ఇలా చేయాలి. అలా గొంతునొప్పి నుంచి ఉపశమనం పొందేవరకూ చేయాలి. దీనివల్ల గొంతునొప్పి పూర్తిగా తగ్గుతుంది.
  • ఈ పేస్టు మొటిమలను తగ్గిస్తుంది. మూడు టీస్పూన్ల తేనె, ఒక టీస్పూను దాల్చినచెక్కపొడి రెండింటినీ బాగా కలిపి పేస్టులా చేయాలి. రాత్రి పడుకోబోయేముందు ఆ పేస్టును ముఖంపై మొటిమలు ఉన్న చోట పూయాలి. పొద్దున్నే లేచిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా రెండు వారాలపాటు నిత్యం చేస్తే మీ చర్మంపై ఉన్న మొటిమలు పోతాయి.

చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్లనుకూడా ఈ పేస్టు నివారిస్తుంది. మీ అవసరానికి తగ్గట్టుగా తేనె, దాల్చిన చెక్క పొడులను తీసుకుని పేస్టులా చేసి చర్మం దెబ్బతిన్న ప్రదేశంలో పూయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న ఎలర్జీలు, దద్దుర్లు, ఎగ్జిమా, ఇతర చర్మ సమస్యలు తగ్గుతాయి.

  • దాల్చినచెక్క, తేనె మిశ్రమం తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారు. ఒక కప్పు వేడి నీళ్లల్లో తేనె, దాల్చినచెక్క పొడి కలిపి డ్రింకు చేసుకోవాలి. దీన్ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ఒకటిన్నర గంట ముందు ఖాళీ కడుపుతో తాగాలి. రాత్రి నిద్రపోయే ముందు కూడా ఈ డ్రింకును తాగాలి. ఇలా ఈ డ్రింకును పగలు, రాత్రి తాగడం వల్ల మీరు బరువు వేగంగా తగ్గుతారు.
  • ఈ పేస్టు నోటి దుర్వాసనను కూడా పోగొడుతుంది. ఒక టీస్పూను తేనె, దాల్చినచెక్క పొడులను వేడి నీళ్లల్లో కలుపుకుని ఉదయం తాగాలి. ఇది మౌత్ ఫ్రెష్నర్ గా పనిచేయడమే కాదు ఎలాంటి దుర్వాసన లేకుండా మీ నోటిని బాగా శుభ్రం చేస్తుంది కూడా.
  • రోజూ ఉదయం, రాత్రి దాల్చిన చెక్క పొడి, తేనె కలిపి తీసుకోవడం వల్ల వినికిడి శక్తి కూడా బాగా మెరుగుపడుతుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News