కార్తీక మాసం రెండవ సోమవారం పురస్కరించుకొని వేలాది మందిగా తరలివచ్చిన భక్తులతో మహానంది క్షేత్రం కిటకిటలాడింది. భక్తులు వేకువజామునే పుణ్యస్నానాలు ఆచరించి, ఆలయ ముఖమండపం, నంది విగ్రహం, ధ్వజస్తంభం, నాగుల కట్ట, ఆలయ పరిసరాల్లో కార్తీక దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
- Advertisement -
భక్తులు శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామివారిని దర్శించుకొని అభిషేకార్చనలు, కేదారేశ్వర నోములు నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం మూడు గంటలకుపైగా దర్శనం సమయం పట్టడంతో రద్దీకి తగ్గ ఏర్పాట్లు లేకపోవడంతో వృద్ధులు, చిన్నారులు, మహిళలు ఇబ్బందులు పడ్డారు. మహానంది ఆలయంతో పాటు గరుడనంది, వినాయక నంది, సూర్యనందిలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.