Friday, November 22, 2024
HomeఆటSanju Samson : అరె ఏంట్రా ఇది.. సంజుకే ఎందుకు ఇలా ..?

Sanju Samson : అరె ఏంట్రా ఇది.. సంజుకే ఎందుకు ఇలా ..?

Sanju Samson : ప్ర‌తీ సారి సంజుశాంస‌న్ కే ఎందుకు ఇలా జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన ప్ర‌శ్న ఇది. భార‌త క్రికెట్ జ‌ట్టులో అంద‌రికి అవ‌కాశాలు ఇస్తున్న‌ప్ప‌టికీ ఒక్క సంజు కే అవ‌కాశాలు రావ‌డం లేదు. సీనియ‌ర్లు లేన‌ప్పుడు ఎంపిక చేయ‌డం త‌ప్పిస్తే ఆడించ‌డం లేదు. ఎప్పుడో ఓ సారి అవ‌కాశం ఇస్తారు. అందులో రాణించినా ప‌ట్టించుకోరు. ప‌దే ప‌దే విఫ‌లం అవుతున్న ఆట‌గాళ్ల‌కు మాత్రం.. మ‌ద్ద‌తు అంటూ లెక్క‌కు మిక్కిలి అవ‌కాశాలు ఇస్తున్నారని అంటూ సోష‌ల్ మీడియాలో సంజు ఫ్యాన్స్ అత‌డికి మ‌ద్ద‌తుగా పోస్టులు పెడుతున్నారు.

- Advertisement -

ప్ర‌స్తుత కివీస్‌తో టీ20 సిరీస్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయిన తొలి టీ20లో చోటు ద‌క్కించుకోలేక పోయిన‌ సంజుకు నేడు(ఆదివారం) జ‌రిగిన రెండో టీ20లోనూ నిరాశే ఎదురైంది. సీనియర్లు లేని ఈ సిరీస్‌లో శాంసన్ తుది జట్టులో ఆడటం ఖాయమని భావించిన అతడి అభిమానులకు వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలోని టీమ్‌మేనేజ్‌మెంట్ దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింది. పోనీ సంజు ప్లేస్‌లో జ‌ట్టులోకి వ‌చ్చిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌లు, దీప‌క్ హుడాలు బ్యాట్‌తో రాణించారా..? అంటే అదీ లేదు. ఇక మిగిలిన ఆఖ‌రి టీ20 మ్యాచ్‌లోనైనా సంజును ఆడిస్తారా..? అంటే అది చెప్ప‌లేని ప‌రిస్థితి.

దీంతో సంజు అభిమానుల్లో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. ఏళ్లు గ‌డుస్తున్నాయి.. కెప్టెన్లు మారుతున్నారు.. కానీ సంజూకు మాత్రం తుది జ‌ట్టులో చోటు ద‌క్క‌డం లేదంటూ త‌మ అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కుతున్నారు. మ్యాచులు ఆడిస్తేనే క‌దా అత‌డిలోని ప్ర‌తిభ ఏంటో తెలుస్తుంది. సిరీస్‌ల‌కు ఎంపిక చేయ‌డం.. మ్యాచ్ స‌మ‌యానికి ప‌క్క‌న పెట్ట‌డం.. ఇలా చేస్తే ఏం లాభం..? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

రిష‌బ్ పంత్ ప‌దే ప‌దే విఫ‌లం అవుతున్నా అత‌డికి అండ‌గా నిలుస్తున్నారు గానీ అలాంటి మద్దతు సంజు శాంసన్‌కు ఇచ్చి ఉంటే ఈ పాటికి టీమ్ఇండియా కెప్టెన్ అయి ఉండేవాడ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. సంజు ప‌ట్ల ఇంత వివ‌క్ష ఏంటో త‌మ‌కు అర్థం కావ‌డం లేద‌ని కామెంట్లు పెడుతున్నారు.

ఇదే విష‌య‌మై భార‌త మాజీ కోచ్‌, కామెంటేట‌ర్ రవిశాస్త్రి స్పందించాడు. రెండో టీ20 ప్రారంభానికి ముందు ఆయ‌న మాట్లాడుతూ శాంస‌న్‌కు త‌గిన‌న్ని అవ‌కాశాలు ఇవ్వాల‌న్నారు. ప్ర‌స్తుత జ‌ట్టులో ఉన్న సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌ను బెంచీకే ప‌రిమితం చేసి శాంస‌న్ వంటి ఆట‌గాళ్ల‌కు అవ‌కాశాలు ఇవ్వాలి. వ‌రుస‌గా ఓ 10 మ్యాచ్‌లు ఆడించాలి. ఆ త‌రువాత అత‌డి ప్ర‌ద‌ర్శ‌న పై ఓ అంచ‌నాకు రావాలి. అంతేకానీ రెండు మ్యాచ్‌లు ఆడించి ప‌క్క‌న బెట్ట‌కూడ‌దు. అత‌డికి త‌గిన‌న్ని అవ‌కాశాలు ఇస్తేనే క‌దా అత‌డి టాలెంట్ ఏంటో తెలిసేది అని అన్నాడు.

సంజు శాంస‌న్‌లో టాలెంట్‌కు కొదువ లేదు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) ద్వారా ఇప్ప‌టికే ఈ విష‌యం నిరూపించుకున్నాడు. గ‌త మూడు, నాలుగు సీజ‌న్ల నుంచి ఐపీఎల్‌లో స్థిరమైన ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నాడు. అయినప్ప‌టికీ అత‌డికి అన్యాయ‌మే జ‌రుగుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News