Sunday, October 6, 2024
HomeదైవంMahanandi: జ్వాలాతోరణ దర్శనం సర్వపాపహరణం

Mahanandi: జ్వాలాతోరణ దర్శనం సర్వపాపహరణం

కార్తీక పౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా..

కార్తీక పౌర్ణమి సందర్భంగా శివనామ మార్మోగిన మహానంది క్షేత్రంలో జ్వాలాతోరణం సంప్రదాయబద్ధంగా జరిపారు. మహానంది పుణ్యక్షేత్రం కోటి దీపకాంతులతో దేదిద్యమానంగా వెలుగొందింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలా తోరణం, కోటి దీపోత్సవం వేడుకలు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి సుధ కుమారి, ఆలయ చైర్మన్ కొమ్మ మహేశ్వర్ రెడ్డి రాధిక దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఆధ్వర్యంలో జ్వాలతోరణాన్ని వెలిగించారు. మహానందీశ్వర స్వామి గర్భాలయంలో వెలిగే అఖండ దీపం నుంచి ఆగ్నిని స్వీకరించి, ఆలయ ముఖమండపం వద్ద వేలాది మంది భక్తుల సమక్షంలో జ్వాలాతోరణం మహోత్సవం నిర్వహించారు.

- Advertisement -

అనంతరం శ్రీ కామేశ్వరి దేవి, మహానందీశ్వర స్వామి ఉత్సవమూర్తులకు ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాని ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించి, కోటి దీపోత్సవం పూజలు నిర్వహించారు. వేద పండితులు రవిశంకర్ అవధాని మాట్లాడుతూ జ్వాలా తోరణం దర్శనం సర్వ పాపాలు తొలగిపోయి, గ్రహ పీడ, భేతా బాధలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అన్నారు. సాక్షాత్తు పార్వతీదేవి జ్వాలాతోరణం క్రింద 3 సార్లు నడిచి, మహాశివుని దర్శించుకున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేలాదిమంది భక్తులు పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా మహానంది ఎస్సై నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రతిష్ట బందోబస్తు నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News