తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తిక మహా దీపోత్సవం కర్నూలు SAP కాంప్ ఆవరణలో వైభవంగా జరిగింది. పండు వెన్నెలలో ఎస్ ఏపీ క్యాంప్ ఆవరణలో తిరుమల తిరుపతి దేవస్థానములు నిర్వహించిన కార్తీక మహా దీపోత్సవం ఘనంగా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
భక్తులు అశేషంగా పాల్గొని ఉత్సవంలో పాల్గొని తన్మయత్వం పొందారు. దీపోత్సవం కంటే ముందు ఎతివందనం వేద స్వస్తి దీప ప్రాకస్త్యం విశ్వక్సేన పూజ పుణ్యా వచనం శ్రీనివాసర్చన శ్రీ మహాలక్ష్మి పూజ అష్టలక్ష్మి వైభవం ముఖ్య రూపకం సామూహిక లక్ష్మీ నీరాజనం జరిపించారు.
ఈ సందర్భంగా రమ్యానంద భారతీ స్వామిని శ్రీ శక్తి పీఠాధిశ్వరి తిరుపతి వారు అనుగ్రహ భాషణం చేశారు. దీపం జ్ఞానానికి సంకేతం . మానవుడు దానవత్వం నుండి మానవత్వం వైపుగా, ఆపై మాధవత్వాభిముఖంగా నడవాలని పిలుపునిచ్చారు.
కార్తికేయుడు జన్మించిన మాసం కాబట్టి కార్తిక మాసం అని పిలుస్తారని, కార్తికేయుని వైభవాన్ని గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన, కలెక్టర్ మాతృమూర్తి , యస్ పి కృష్ణ కాంత్ దంపతులు, ఎం ఎల్ ఏ కాటసాని రాంభూపాల్ రెడ్డి దంపతులు, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ , మాజీ యం. పి టి .జి . వెంకటేష్ , తిరుమల తిరుపతి దేవస్థానములు సంయుక్త కార్యనిర్వహణాధికారి సదా భార్గవి, తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధార్మిక ప్రాజెక్టు అధికారి కె. రాజగోపాల్, కార్యదర్శి డాక్టర్ సోమయాజులు, అన్నమాచార్య ప్రాజెక్టు డెరైక్టర్ డాక్టర్ ఆకెళ్ళ విభీషణ శర్మ, కెడిసిసి ఛైర్పర్సన్ ఎస్.వి.విజయమనోహరి, మాజీ ఎంఎల్ఏ ఎస్.వి.మోహన్ రెడ్డి, తితిదే అధికారులు, తదితరులు పాల్గొన్నారు.