Saturday, October 5, 2024
HomeతెలంగాణAyyappa Swamies demand: అయ్యప్ప స్వాములను పట్టించుకోని పార్టీలు

Ayyappa Swamies demand: అయ్యప్ప స్వాములను పట్టించుకోని పార్టీలు

అయ్యప్ప స్వాములకు ప్రత్యేక రాయితీ ఇవ్వాలి

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఏ ఒక్కటి కూడా అయ్యప్ప స్వాముల సమస్యలను ప్రస్తావించకపోవడం దురదృష్టకరం. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం నాలుగు నుంచి ఐదు వేల మందికి తక్కువ కాకుండా అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకుంటున్న భక్తులు ఎంతోమంది ఉన్నారు. ఈ స్వాముల సంఖ్య పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపు ఓటమి నిర్ణయించే స్థాయిలో స్వాముల సంఖ్య ఉన్న కూడా ఏ ఒక్క పార్టీ ఇంతవరకు అయ్యప్ప స్వాములను దృష్టిలో పెట్టుకొని మాట్లాడకపోవడం చాలా విచారకరం ప్రతి సంవత్సరం మండల కాలం పాటు కులాలు ,మతాలు చిన్న, పెద్ద బీద, గొప్ప తేడా లేకుండా కఠిన నియమాలతో దీక్షలు చేసి స్వామి వారి దర్శనార్థమై శబరిమలై వెళ్తున్న భక్తులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు మార్గం ద్వారా 12 సీట్లు ఉన్న వాహనంలో వెళ్లాలి అంటే ఆంధ్ర, కర్ణాటక,తమిళనాడు, కేరళ ఈ 4 రాష్ట్రాలకి టాక్స్ ల రూపకంగా 35 నుంచి 40 వేలు కట్టడం జరుగుతున్న అదే 36 సీట్ల బస్సులు అయితే 90 నుంచి లక్ష వరకు టాక్స్ కట్టవలసిన పరిస్థితి మరి ఇందులో కర్ణాటక రాష్ట్రం వెళ్లాలంటే అదనంగా 30000 కట్టవలసిన పరిస్థితి రైలు మార్గం ద్వారా ప్రయాణం చేద్దామంటే టికెట్స్ దొరకని పరిస్థితి దొరికిన సరియైన సౌకర్యాలు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కొట్టాయం, చెంగనూరు రైల్వే స్టేషన్ లో దిగిన తర్వాత అక్కడ నుంచి స్వామివారి సన్నిధానం చేరుకోవాలంటే కనీసం ఒక్కొక్కరికి వెయ్యి నుంచి 1500 ఖర్చు అవుతున్న పరిస్థితి ఇక ఎవరైనా స్తోమత ఉన్న స్వాములు ఆకాశం మార్గాన విమానాల ద్వారా వెళ్దాం అనుకుంటే అయ్యప్ప స్వాముల సీజన్ వచ్చిందంటేనే 4000 రూపాయలు ఉన్న విమానం టికెట్ ధర 10,000 నుండి 15,000 అవుతున్న సందర్భం కనబడుతుంది. మన రాష్ట్రంలో ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న స్వాముల గురించి ఏ ఒక్క పార్టీ ఆలోచించడం లేదంటే ఏమనుకోవాలి ముస్లిమ్స్ మక్కా వెళ్లాలి అంటే రాయితీలు ఇస్తూ ఎయిర్పోర్టులో ఒక ప్రత్యేకమైన టెర్మినల్ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వాలు క్రిస్టియన్స్ జెరూసలేం వెళ్లాలి అంటే వారికి ప్రత్యేకమైన రాయితీలు ఇస్తూ సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వాలకు పార్టీలకు అయ్యప్ప స్వాములు కనపడడం లేదా అయ్యప్ప స్వాములకు కూడా కనీసం నవంబర్ 20 తారీకు నుండి మొదలుకొని జనవరి 20 వరకు రెండు నెలల పాటు పక్క రాష్ట్రాలతో మాట్లాడి రోడ్డు మార్గం ద్వారా వెళ్లే స్వాముల వాహనాలకు టాక్స్ రద్దు చేయించలేరా ఇతర మతాల వారికి ఇచ్చే విధంగా అయ్యప్ప స్వాములకు కూడా రైళ్లలోనూ విమానాలలోనూ రాయితీలు కల్పించలేరా ఎందుకు స్వాములపై ఇంత వివక్ష ఎంతో మంది రాజకీయ నాయకులు కూడా స్వామివారి దీక్ష చేస్తున్నారు కదా మీరైతే వీఐపీ సౌకర్యాల తో వెళ్తారు. సామాన్యుల పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి స్వాములం మేమేమన్నా మీరు వేరే మతాల వారికి ఇఫ్తార్ విందులు, క్రిస్మస్ విందులు ఇచ్చినట్టుగా మాకు బిక్ష కార్యక్రమాలు అల్పాహార కార్యక్రమాలు ఏర్పాటు చేయమని మిమ్మల్ని ఏమైనా అడుగుతున్నామా పైగా ఈ రెండు నెలల పాటు మేము దీక్షలు చేయడం వల్ల వ్యాపారం ఎంతగానో పెరుగుతుంది. పూలు కూరగాయలు, పళ్ళు, పాలు, పెరుగు, బియ్యం, పప్పు దినుసులు, బెల్లం, చక్కర, ఆవు నెయ్యి, నువ్వుల నూనె, కొబ్బరికాయలు, అగర్బత్తలు కర్పూరంలు, తమలపాకులు, పూజా సామాగ్రి, సౌండ్ సిస్టం, టెంట్ హౌస్, భజన మండలి ట్రావెల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఈ రెండు నెలల పాటు రెండు నుంచి మూడు వేల కోట్ల రూపాయల ఖర్చుతో మేము వివిధ వర్గాల వారికి జీవనోపాధిని కల్పిస్తూ రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూరుస్తూ ఎంతో నియమినిస్టులతో దీక్ష చేస్తున్న మమ్మల్ని పట్టించుకోకపోవడం మా కనీస సౌకర్యాల కోసం ఆలోచించకపోవడం ఎంతవరకు సమంజసము అన్ని రాజకీయ పార్టీల నాయకులారా ఒక్కసారి ఆలోచించండి మా సమస్యలపై స్పందించండి చివరిగా అయ్యప్ప దీక్ష తీసుకున్న గురు స్వాములకు, స్వాములందరికీ నా యొక్క విన్నపం మరొక రెండు రోజుల సమయం ఉంది అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలి ధర్మ సంరక్షణ కోసం అయ్యప్ప స్వాముల హక్కుల కోసం పాటుపడాలి స్వామి ఇంతవరకు ఈ సమస్యలు మీ దృష్టికి రాకపోతే స్వామి మేము అడుగుతున్నాం అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదు అని అంటారు. అందుకే పత్రికా ముఖంగా అడుగుతున్నాము. ఇప్పటికైనా వివిధ పార్టీల నాయకులు మా సమస్యలను పరిష్కారం చేయగలరని వారు ఈ సందర్భంగా కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News