సిరిసిల్ల నియోజకవర్గంకు సంబంధించి సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వేములవాడ నియోజకవర్గంకు సంబంధించి వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ సిబ్బంది పంపిణీ కేంద్రాలకు చేరుకున్నారు. ఇక ఈవీఎంలు, ఇతర సామగ్రిని అధికారులు అందజేశారు.
- Advertisement -
పోలింగ్ సిబ్బంది సాయంత్రంలోపు కేంద్రాలకు చేరుకున్నారు. బుధవారం సిరిసిల్ల, వేములవాడ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ పరిశీలించారు. అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.