ఇందిరమ్మ మనువడు..బీజేపీ సీనియర్ నేత, పార్లమెంట్ సభ్యుడు కూడా అయిన వరుణ్ గాంధీ బీజేపీకి గుడ్ బై కొట్టి..కాంగ్రెస్ లో చేరనున్నారా? ఇది గత కొన్నేళ్లుగా వినిపిస్తున్న రూమర్ అయినప్పటికీ..ఈసారి మాత్రం ఇది నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా బీజేపీలో స్థబ్దుగా, ఆగ్రహంగా ఉన్న వరుణ్ గాంధీ..ఆపార్టీలో ఇమడలేక, యుపీ సీఎం అభ్యర్థి కాలేక..కేంద్ర మంత్రి పదవి రాక అసహనంతో ఊగిపోతున్నారు. కానీ ఇప్పటి వరకు బీజేపీలోనే సైలెంట్ గా ఉంటూ.. అప్పుడప్పుడు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తూ టైం పాస్ చేసుకుంటున్న ఆయన ఈసారి సీరియస్ గానే కాంగ్రెస్ లోకి జంప్ అయ్యే ప్రయత్నంలో ఉన్నారని గట్టిగా వినిపిస్తోంది. గత రెండేళ్లుగా కేవలం ఓ కాలమిస్టుగా మోడీ విధానాలపై అత్యంత విమర్శనాత్మకంగా కాలమ్స్ రాస్తున్న వరుణ్.. తాజాగా తాను నెహ్రూ వ్యతిరేకిని కానని అలాగని కాంగ్రెస్ కు వ్యతిరేకంగా లేనని ఓ సభలో చెప్పటం విశేషం. మతతత్వ రాజకీయాలు పడగవిప్పుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఇదంతా చూస్తుంటే వచ్చే ఎన్నికలనాటికి ఆయన కాంగ్రెస్ లో చేరటం ఖాయమనే లీకులు గట్టిగా వస్తున్నాయి.
Congress: బీజేపీకి గుడ్ బై..కాంగ్రెస్ లోకి ఇందిరమ్మ మనువడు?
సంబంధిత వార్తలు | RELATED ARTICLES