Sunday, October 6, 2024
HomeదైవంBhairavagundala: శివ పార్వతుల కళ్యాణం కమనీయం రమణీయం

Bhairavagundala: శివ పార్వతుల కళ్యాణం కమనీయం రమణీయం

బైరవగుండాల క్షేత్రంలో పోటెత్తిన జనం

నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చింతలచెరువు గ్రామం సమీపంలో ఉండే బైరవగుండాల క్షేత్రంలో వెలిసిన బైరవేశ్వరుడుకు కార్తీక పౌర్ణమి సందర్భంగా వేలాది మంది భక్త జనంతో శివ పార్వతులకు విశేష పూజలు జరిపించారు. కైపా వెంకట నరసింహ శాస్త్రి ఆధ్వర్యములో శివ పార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా కమనీయ రమణీయంగా జరిపించారు. ఉభయదారులు శివుడి తరుపున తొమ్మండ్రు నాగేంద్ర కుమార్ ధర్మపత్ని సుప్రజ పార్వతి అమ్మవారి తరుపున ఆదవేణి రవికుమార్ ధర్మపత్ని శిరిషా రాణి పీటలపై కూర్చున్నారు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజున వేలాది మంది భైరవగుండాల క్షేత్రాన్ని దర్శించి అక్కడ ఉన్న శ్రీ కాశిరెడ్డి నాయన ఆశ్రమాన్ని దర్శించి శివ పార్వతుల కళ్యాణం వీక్షించారు.

- Advertisement -

భూమా అఖిలప్రియ శివపార్వతులను దర్శించుకున్నారు. వందలాది మంది మహిళలు నెత్తిన కార్తీక దీపం పెట్టుకొని ఊరేగింపుగా అక్కడ ఉన్న తెలుగుగంగ ప్రాజెక్టు గల నదిలో కార్తీక దీపాలను వదిలి వారి మొక్కుబడులు తీర్చుకుంటారు. శ్రీ కాశిరెడ్డి నాయన శిష్యుడు మునయ్య స్వామి జన్మదినం సంధర్భంగా ఆళ్లగడ్డ పట్టణ ఎమ్మెల్యే గంగుల బ్రిజెంద్రా రెడ్డి పాల్గొని శివ పార్వతుల కళ్యాణం వీక్షించి మున్నయ్య స్వామి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. భక్తుల సమక్షంలో మునయ్య స్వామి కేక్ కట్ చేసి వారి ఆశిస్సులు అందేలా వేడుకలను జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్టీ స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే గంగుల నాని, మండల అధ్యక్షుడు రామిశెట్టి వీరభద్రుడు , మండల కన్వీనర్ కుమార్ రెడ్డి, సేవాదళ్ అధ్యక్షుడు గణేష్ రెడ్డి, బోర్ వెల్స్ అధినేత చుండూరు వెంకట రమణ, వైఎస్సార్సీపీ పార్టీ సీనియర్ నాయకులు తొమ్మండ్రు నాగేంద్ర కుమార్, సుప్రజ, ఆదవేణి రవికుమార్, శిరిషరాణి, పార్టీ కార్యకర్తలు, భూమా అఖిలప్రియ, భక్తాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News