బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఎంత పెద్ద ఫైర్ బ్రాండో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈమె మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. హేట్ స్పీచ్ విషయంలో ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ 100 మంది మాజీ బ్యూరోక్రాట్స్ ఓపన్ లెటర్ రాయటం సెన్సేషనల్ గా మారింది. రెచ్చగొట్టేలా మాట్లాడిన సాధ్వి ప్రజ్ఞా ఎంపీగా కొనసాగే అర్హత పోగొట్టుకున్నారని వంద మంది బ్యూరోక్రాట్లు హెచ్చరించారు. లోక్ సభ ఎథిక్స్ కమిటీ ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని బహిరంగ లేఖలో డిమాండ్ చేశారు. 103 మంది మాజీ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరటం కర్నాటక, మధ్యప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద మలుపుగా భావిస్తున్నారు.