గోనెగండ్ల మండల కేంద్రంలో మాజీ క్రీడాకారుడు రిటైర్డ్ హెడ్మాస్టర్ కీర్తిశేషులు పెద్ద రంగస్వామి స్మారక 70వ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళ కబడ్డీ పోటీలు నిన్నటి రోజున మొదలైన రెండవ రోజుకూడా చాలా రసవత్తరంగా జరుగుతున్నాయి.
ఉమ్మడి 13 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు గట్టి పోటీ ఇస్తూ మంచి ప్రతిభను కనబరుస్తున్నారు. చూడడానికి అమ్మాయిలే కానీ కోర్టులో ఆడ పులుల్లాగా పరుగెత్తుతూ పట్టుకుంటే ఉడుము పట్టే అన్నట్టు అమ్మాయిలు క్రీడా స్ఫూర్తిని కనపరుస్తున్నారు. 13 జిల్లాలు 13 జట్లు తలపడగా లీగ్ దశ నుండి 8 జట్లు నాకౌట్ దశకు చేరుకున్నాయి. నాకౌట్ మ్యాచ్ లు నుండి నాలుగు జట్లు సెమీఫైనల్ చేరుకుంటాయి. రాష్ట్రస్థాయి క్రీడలు గ్రామీణ ప్రాంతంలో జరగడం వలన పెద్ద ఎత్తున ప్రజలు తిలకిస్తూ ఆనంద కేరింతలతో ఈలలు కేకలు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
క్రీడాకారులను ప్రభుత్వ అధికారులు, పోలీస్ శాఖ, విలేకరుల బృందం, రాజకీయ నాయకులు పరిచయం చేసుకొని క్రీడలని తిలకించారు. వచ్చిన క్రీడాకారులకు ఆర్గనైజర్స్ కుబేర నాయుడు, సహాయ బృందం చక్కటి భోజన, టిఫిన్ వసతి కల్పించారు. ఇలాంటి క్రీడాలు మరెన్నో మన గోనెగండ్ల మండలంలో ఏర్పాటు చేయాలని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ ఆశాభావం తెలిపారు.