Saturday, November 23, 2024
HomeతెలంగాణChevella: కల్తీ ఫుడ్ తో బాలికలకు కడుపునొప్పి

Chevella: కల్తీ ఫుడ్ తో బాలికలకు కడుపునొప్పి

16 మంది విద్యార్థులు అస్వస్థతతో చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన వైనం

ఆ విద్యార్థినీలందరివి పేద కుటుంబాలు. వారి కుటుంబాలను వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు. ఈ కుటుంబాల నుంచి పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నది వారి లక్ష్యం. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ… కష్టపడి చదివి సీటు సంపాదిస్తారు. తల్లిదండ్రిని వదిలి చదివే లక్ష్యంగా హాస్టల్ ఏ ప్రపంచంగా ప్రభుత్వం పెట్టే ఫుడ్డు తింటూ… ఉన్నత లక్షం కోసం చదువుతున్న విద్యార్థులు.

- Advertisement -

అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ విద్యార్థినిలు హరిగోశ పడుతున్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల సంయుక్త పాఠశాల, కళాశాల కొడంగల్ వికారాబాద్ జిల్లా. కొడంగల్ లో భవన సదుపాయం లేక చేవెళ్ల నియోజకవర్గం ఊరెళ్ళ గ్రామం సాగర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ స్కూల్ అండ్ కాలేజ్ రెసిడెన్షియల్ హాస్టల్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థినిలు డిసెంబర్ ఆదివారం 3 రాత్రి కడుపునొప్పితో బాధపడుతూ… సోమవారం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 16 మంది చేరారు. హాస్టల్ లో మరో 10మంది విద్యార్థినిలు చికిత్స పొందుతున్నారు. ఇంకొంత మంది విద్యార్థినిలను హాస్టల్లోనే వైద్యం అందిస్తున్నారు. హాస్టల్ లో మొత్తం 40 మంది విద్యార్థినిలకు డాక్టర్లు వైద్యం అందించారు. దీనికి కారణం ఫుడ్ పాయిజన్ అనే తెలుస్తుంది.

తక్షణమే స్పందించిన డిఎంహెచ్ఓ

మహాత్మా జ్యోతిరావు పూలే బిసి గురుకుల పాఠశాలలో విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారని తెలిసి హుటాహుటిన హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని విద్యార్థినిల కండిషన్ తెలుసుకున్నారు. వైద్య సిబ్బందిని హాస్టల్ కు తరలించి విద్యార్థినిలకు వైద్యం అందిస్తున్నారు. విద్యార్థినిలకు ఫుడ్ పాయిజన్ అయిందని స్కూల్ సిబ్బంది తొందరగా స్పందించడం వల్ల వారి ఆరోగ్యానికి ఎలాంటి హాని లేదని ఒక్కరు మినహా విద్యార్ధినిల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఇప్పటి వరకు 40మంది విద్యార్ధినిలకు వైద్యం అందించమన్నారు.

ప్రిన్సిపల్ అనిత

పేరెంట్స్ తెచ్చిన ఫుడ్ తినడం వల్ల ఇన్ఫెక్షన్ అయిందని కళాశాల ప్రిన్సిపల్ అనిత అన్నారు. హాస్టల్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉన్నాయని పిల్లలకు మంచి ఫుడ్ ఇస్తున్నామని వాతావరణంలోని మార్పు వల్ల జరిగి ఉంటుందన్నారు. రెండు కాలేజీలకు కలిపి 1200 మంది విద్యార్థులు ఉంటారని ఇక్కడ ఫుడ్ పాయిజన్ ఎప్పుడు జరగలేదన్నారు. ప్రిన్సిపల్ ఫుడ్ పాయిజన్ జరిగిందని ఒప్పుకోకపోగా పేరెంట్స్ తెచ్చిన బిర్యాని నూడిల్స్ తినడంతో జరిగిందని పేరెంట్స్ పై నెట్టడం ఆశాస్పదం. ఇంటర్ చదువుతున్న విద్యార్థి పేరెంట్స్ బయటి ఫుడ్ అలాంటిది ఏదైనా తెస్తే 40 మంది విద్యార్థినిలు అస్వస్థతకు ఎందుకు గురైతరన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది.

వార్డెన్ సల్మా బేగం
అస్వస్థత పై వార్డెన్ నజియాబేగం ను వివరణ కోరగా పిల్లలు మజ్జిగ తాగడం వల్ల వాతావరణంలోని మార్పుతో ఇలా జరిగిందన్నారు. వాతావరణం లోని మార్పులే దీనికి కారణం అన్నారు.

రంగారెడ్డి జిల్లా ఫుడ్ కంట్రోలర్ ఉదయ్ కిరణ్

మీడియా ప్రతినిధులు పుట్ కంట్రోలర్ ఉదయ్ కిరణ్ కు ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన విద్యార్థినిల విషయం తెలుపగా హాస్టల్ ను సందర్శించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.

వాస్తవ పరిస్థితులు దారుణం
పై అధికారుల వివరణ తీసుకున్న అనంతరం మీడియా ప్రతినిధులు హాస్టల్లో కిచెన్ ను విజిట్ చేయగా విద్యార్థినిలకు మధ్యాహ్న భోజనం వండుతుండగా అండ (బగువని)లో బియ్యంలో ఉన్న లక్క పురుగులు పైన తేలి “పాలలో మీగడ (మలై)మాదిరిగా” తేరుకోవడం కనిపించింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం దామోదర్ రెడ్డికి కళాశాల ప్రిన్సిపల్ అనితకు తెలుపగా వారి దగ్గర ఎలాంటి సమాధానం లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టింది. ఆ అన్నాన్ని పారబోసి కొత్త అన్నం వండాలని డిఎంహెచ్ఓ చెప్పగా అప్పటికే అన్నం రెడీ అయిపోయింది. కిచెన్ లో నీట్నెస్ లేక గదిలో అక్కడక్కడ నల్లగా పాకురు పేరుకుపోయిన దృశ్యాలు ఉన్నాయి.

హాస్టల్ లో గతంలో కూడా ఇదే తంతు
మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో ఇలాంటి సమస్యలు ఇదివరకు వెలుగు చూశాయి. మీడియా ద్వారా విషయం తెలుసుకున్న జిల్లా స్థాయి అధికారులు కళాశాలను సందర్శించారు. అది జరిగి దాదాపుగా సంవత్సరం గడిచినా అనంతరం మళ్లీ అదే సీన్ రిపీట్ కావడం గమనార్హం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News