Friday, November 22, 2024
Homeపాలిటిక్స్Kaushik: గొంతులో ఊపిరి ఉన్నంత వరకు కెసిఆర్ తోనే

Kaushik: గొంతులో ఊపిరి ఉన్నంత వరకు కెసిఆర్ తోనే

నాపై తప్పుడు ప్రచారం అంటూ మండిపాటు

నా గొంతులో ఊపిరి ఉన్నంతవరకు కేసీఆర్ తోనే, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… తనపై నమ్మకం ఉంచి హుజురాబాద్ టికెట్ ఇవ్వడంతో పాటు గత కొంతకాలంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన కేసీఆర్ కే తన సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. తాను గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో కలిసి దిగిన ఫోటోను ఇప్పటి ఫోటోగా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఊపిరి ఉన్నంతవరకు కేసీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తానని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తనపై అభిమానం చూపించి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి సలాం అన్నారు. హుజురాబాద్ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, హుజురాబాద్ అభివృద్ధి కోసమే తాను పాటుపడతానని, ప్రజలకు ఎన్నికలు సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చేందుకు కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వం ఏది ఉన్నప్పటికీ హుజురాబాద్ కు కావలసినవన్నీ కొట్లాడి మరి సాధించుకుంటానని అన్నారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేయాలన్నారు. సంక్షేమ పథకాల అమలుతోపాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందన్నారు. హుజురాబాద్ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతూ నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని గెలుచుకుంటానని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

అనంతరం ఎమ్మెల్యే సతీమణి, కూతురు శాలిని రెడ్డి, శ్రీనిక రెడ్డి మాట్లాడుతూ… తమపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. హుజురాబాద్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే తో పాటు తాము కూడా కష్టపడతామని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక శ్రీనివాస్, వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల శ్రీనివాస్, బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, సోషల్ మీడియా నాయకురాలు పావని గౌడ్, కేతిరి రాజిరెడ్డి, రూపిరెడ్డి నిరంజన్ రెడ్డి, తాళ్లపల్లి వెంకటేష్, రాజమౌళి, పలువురు కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News