మించాగ్ తుఫాన్ ప్రమాదకరంగా మారుతున్నదని, ములుగు నియోజకవర్గంలోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేయాలని ములుగు ఎమ్మెల్యే తన సరి సీతక్క జిల్లా అధికారులను ఆదేశించారు. వాతావరణ శాఖ ములుగు జిల్లాను రెడ్ జోన్ గా ప్రకటించడంతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, లోతట్టు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. బంగాళాఖాతం లో ఏర్పడిన తుఫాన్ ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై పడిందని దీని ప్రభావంతో జిల్లా లో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్న నేపథ్యంలో కలెక్టర్ అధికార యంత్రాంగం అప్రమత్తం చెయ్యాలని అన్నారు.
మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని గోదావరి తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని, అవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని అన్నారు. జిల్లా అధికార యంత్రాంగం ఎలాంటి నష్టాలు జరగకుండా నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని రైతులు అందులో చెందకుండా సూచనలు చేయాలని, పొలాల్లో ఉన్న వారి ధాన్యంతో పాటు తడిసిన వరి ధాన్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కళ్ళలో ఉన్న వరి ధాన్యంతో పాటు ఇతర పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సీతక్క అన్నారు.