Saturday, October 5, 2024
HomeఆటKarate: బంగారు పతకం సాధించిన అర్ష్ జిమీల్

Karate: బంగారు పతకం సాధించిన అర్ష్ జిమీల్

OU ఇంటర్ కళాశాల కరాటే టోర్నీలో కింగ్ షోటోకాన్ విద్యార్థుల ప్రతిభ

ఉస్మానియా యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఐఎస్ఎల్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 4న నిర్వహించిన ఇంటర్ కళాశాల కరాటే టోర్నమెంట్ లో కింగ్ షోటోకాన్ కరాటే క్లబ్ విద్యార్థులు ప్రతిభ చాటి పతకాలు సాధించినట్లు ఫౌండర్ జహంగీర్ పాషా ఖాద్రీ తెలిపారు. ఈ టోర్నమెంట్ లో క్లబ్ విద్యార్థి మహ్మద్ అర్ష్ జమీల్ బంగారు పతకం సాధించి, మధ్యప్రదేశ్ రాష్ట్రం భూపాల్లో జరిగే సౌత్ వెస్ట్ జోన్ యూనివర్సిటీ కరాటే టోర్నమెంట్ కు ఎంపికైనట్లు తెలిపారు. క్లబ్ కు చెందిన మరో విద్యార్ధి ఉజేఫ్ షరీప్ కుమితే విభాగంలో మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించినట్లు విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ, ఐఎస్ఎల్ కళాశాల స్పోర్ట్స్ డైరెక్టర్ అలీలు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. పతకాలు సాధించిన విద్యార్థులను మాస్టర్ జహంగీర్ పాషా ఖాద్రీ, క్లబ్ సభ్యులు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News